Viral Video: ప్రేమించుకున్నారు.. పెళ్ళి చేసుకున్నారు.. అవ్వాతాతల వయసెంతో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-03-01T13:15:18+05:30

ఇరవై ఏళ్ళ వాడు ఈ రాముడైతే.. పదహారేళ్ళ పడుచు ఆ జానకమ్మే... అనిపిస్తుంది ఈ అవ్వాతాతలను చూస్తే..

Viral Video: ప్రేమించుకున్నారు.. పెళ్ళి చేసుకున్నారు.. అవ్వాతాతల వయసెంతో తెలిస్తే..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఈకాలంలో ప్రేమపెళ్ళిళ్ళు చాలా సహజం అయిపోయాయి. తాము ఇష్టపడిన వారిని పెళ్ళి చేసుకోవడానికి పెద్దలను ఎదిరించడానికి ఏమాత్రం వెనుకాడరు. కానీ పెద్దవాళ్ళు ప్రేమ పెళ్ళి చేసుకోడం కాస్త విచిత్రమే.. నెట్టింట్లో వైరల్ గా మారిన ఈ అవ్వాతాతల వయసు అక్షరాలా ఏడుపదులకు పైమాటే.. వీరి పరిచయం ఎలా జరిగింది? ఈ వయసులో ప్రేమ పెళ్ళి ఎందుకు చేసుకున్నారు మొదలైన వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్ర(Maharastra) రాష్ట్రం కొల్హాపుర్(Kolhapur) లో ఓ వృద్దాశ్రమం(Oldage Home) ఉంది. ఈ వృద్దాశ్రమంలో బాబూరావు పాటిల్ అనే 75ఏళ్ళ వృద్దుడు ఉన్నాడు. అదే వృద్దాశ్రమంలో అనుసయ షిండే అనే 70ఏళ్ళ వృద్దురాలు ఉంది. వృద్దాశ్రమంలో ఉన్న వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఒకరితో మరొకరు జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని వృద్దాశ్రమ నిర్వాహకులకు చెప్పారు. నిర్వాహకులు వారి ప్రేమకు సంతోషించారు. ఆ వయసులో పెద్దలకు ఒకరితోడు మరొకరికి అవసరమేనని, పెళ్ళి ద్వారా అది సాధ్యమవుతుందని అనిపించింది. దాంతో వారిద్దరికీ ఆచార సంప్రదాయాల ప్రకారం పెళ్ళి జరిపించాలనుకున్నారు. కొల్హాపూర్ టెంపుల్ లో వరుడు బాబూరావు పాటిల్, వధువు అనుసయ షిండే మెడలో పూలహారం వేసి ఆమెను భార్యగా స్వీకరించాడు. వధువు కూడా వరుడి మెడలోపూలహారం వేసి అతడిని భర్తగా స్వీకరించింది. ఇలా వీరిద్దరూ దైవ సమక్షంలో ఒక్కటయ్యారు. అక్కడున్న అందరూ వీరిద్దరికీ ఆశీర్వాదం అందజేసారు.ఈ అవ్వాతాతల కళ్యాణం వీడియోను, వీరి పెళ్ళి ఫోటోలను Vivek Gupta అనే ట్విట్టర్ యూజర్ ట్విట్టర్ లో షేర్ చేశాడు. దీనికి నెటిజన్ల నుండి చాలా స్పందన వస్తోంది. ఆ వయసులోవారికి ఒకరి తోడు మరొకరి అవసరం అని కొందరు కామెంట్ చేశారు. మరొకరు అయితే ప్రేమ మనసుకు సంబంధించినది దానికి వయసుతో సంబంధం లేదు అని చెప్పుకొచ్చారు. వృద్దాశ్రమంలో ఒంటరిగా బ్రతకమని వీళ్ళ పిల్లలు వీళ్ళను వదిలేసినా ఇలా తోడు వెతుక్కుని మంచి పని చేశారని మరికొందరు అన్నారు.

Read also: Brave Abhinandan: 60గంటలు పాకిస్తాన్ నిర్భంధంలో భారతీయ వీరుడు.. ఈయన సాహసం గుర్తుచేసుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయ్..


Updated Date - 2023-03-01T13:18:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!