Viral Video: మహానటి సావిత్రి మళ్లీ పుట్టిందా ఏంటి..? గ్లిజరిన్ లేకుండానే కంట్లోంచి ఈ బాలిక ఎలా కన్నీళ్లు తెప్పించిందో చూస్తే..
ABN, First Publish Date - 2023-03-28T18:23:38+05:30
ఈ పాప కూడా అలవోకగా కన్నీళ్ళు తెప్పిస్తోంటే.. 'మహానటి సావిత్రి(Mahanati Savitri) మళ్లీ పుట్టిందా ఏంటి?' అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు
తెలుగు సినీ అభిమానులకు దొరికిన గొప్ప నటి సావిత్రి గారు. గ్లిజరిన్ అవసరం లేకుండా కళ్ళలో కన్నీళ్ళు(Tears without glycerine) తెప్పించడం సావిత్రిగారికి మాత్రమే చెల్లింది. మహానటి సినిమాలో ఈ సీన్ ను చూసి ఆమెను తలచుకుని కన్నీళ్ళు పెట్టుకున్న అభిమానులు ఉన్నారు. అయితే ఓ చిన్నపాప ఇప్పుడు సావిత్రి గారిని గుర్తుచేస్తోంది. సావిత్రి గారు ఎలాగైతే గ్లిజరిన్ లేకుండా కన్నీళ్ళు తెప్పించేవారో అలాగే ఈ పాప కూడా అలవోకగా కన్నీళ్ళు తెప్పించింది. ఈ పాపను చూసినవారు 'మహానటి సావిత్రి(Mahanati Savitri) మళ్లీ పుట్టిందా ఏంటి?' అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాప వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాలు తెలుసుకుంటే..
ఇప్పట్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ చాలా చక్కగా నటిస్తారు. కొందరి నటన సోషల్ మీడియా పుణ్యమా అని వైరల్ అవుతుంది. అయితే ఈ నటనలో కూడా కొన్ని పండించడం కొందరికే సాధ్యం. మహానటి సావిత్రి నటన కూడా అలాంటిదే. ఆమె నటనలో కొన్ని సంఘటనలను బీట్ చేయడం చాలా కష్టం. కానీ ఓ చిన్న పాప నటన ఇప్పుడు మహానటి సావిత్రిని గుర్తుచేస్తోంది. వీడియోలో ఒక చిన్నపాపతో 'నువ్వు ఏడిస్తే నీకు 50రూపాయలు ఇస్తాను' అని ఒక వ్యక్తి చిన్న బెట్ వేశారు. ఆ పాప 50రూపాయల కోసం తన ఏడుపు నటన ప్రారంభిస్తుంది. చిన్నపిల్లలు సహజంగా నోరు తెరచి గట్టిగా ఎలా ఏడుస్తారో అలాగే ఈ పాప కూడా ఏడుస్తుంది. ఆ పాప ఏడుస్తుండగా కళ్ళనుండి నీళ్ళు జలజలా చెక్కిళ్ళనుండి జారిపడ్డాయి. ఆ పాపకు డబ్బు ఇస్తానన్న వ్యక్తి ఇక చాలు ఆపెయ్ అనగానే.. టక్కున కుళాయి ఆఫ్ చెయ్యగానే నీళ్ళు ఆగిపోయినట్టు ఆ పాప కన్నీళ్ళు ఆగిపోయాయి. అప్పటివరకు ఉన్న ఏడుపు ముఖంలో ముసిముసి నవ్వులు వచ్చిపడ్డాయి. ఆ పాపకు పళ్ళమధ్యలో ఒక పన్ను ఊడిపోయింది. ఆ పాప నవ్వుతుంటే పళ్లమధ్యలో కనిపించిన తొర్ర భలే ముచ్చటగా ఉంది.
Thoda Shareef అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 'ఈ పాప నటిస్తోందా లేక నిజంగా ఏడుస్తోందా?' అని అంటున్నారు. పాప నటన అద్భుతంగా ఉందని మరికొందరు కామెంట్స్ చేశారు. 'ఈ పాపకు ఖచ్చితంగా ఆస్కార్ ఇవ్వాల్సిందే.. అంతలోనే ఏడవడం, అంతలోనే నవ్వడం, ఆ పాప ముఖంలో హవాభావాలు అద్భుతం' అని మరికొందరు ఈ పాప నటనకు ప్రసంశలు కురిపిస్తున్నారు.
Updated Date - 2023-03-28T18:23:38+05:30 IST