Viral Video: ఎంతైనా తల్లి కదా.. బిడ్డ ప్రాణాలు పోతుంటే చూడలేక.. ఈ తల్లి ఉడుము ఏం చేసిందో చూడండి..
ABN, First Publish Date - 2023-07-31T17:09:20+05:30
బిడ్డ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు పోరాడటం మాత్రమే తెలుసు తల్లికి. ఇది మనుషులలో అయినా జంతువులలో అయినా బేధం ఏమీ ఉండదు.
ఈ ప్రపంచంలో తల్లికీ బిడ్డకూ ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. మనుషులు అయినా, జంతువులు అయినా తమ బిడ్డల మీద ఒకే ప్రేమ కలిగి ఉంటారు. బిడ్డ ప్రమాదంలో ఉన్నప్పుడు తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా బిడ్డను కాపాడుకుంటారు. ఇదే విషయాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెబుతోంది ఒక వీడియో.. పాము చేతిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తన బిడ్డను కాపాడుకోవడానికి ఓ తల్లి ఉడుము చేసిన పోరాటం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. చివరకు ఏం జరిగిందో చూస్తే మనసు బరువెక్కుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
బిడ్డ ఎంత తప్పు చేసినా బాధలో ఉన్నప్పుడు ప్రేమగా అక్కున చేర్చుకునే గుణం కేవలం తల్లికి(Mother) మాత్రమే ఉంటుంది. ఇక బిడ్డ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు పోరాడటం మాత్రమే తెలుసు తల్లికి. ఇది మనుషులలో అయినా జంతువులలో అయినా బేధం ఏమీ ఉండదు. ఆడవిలో బండరాళ్ళమీద ఓ ఉడుము పిల్ల(baby wild lizard) ఆడుకుంటోంటే ఓ పాము(snake) చూసింది. అది అదను చూసి ఉడుము పిల్లమీద దాడి చేసింది. ఈ దాడిలో పాము ఉడుము పిల్ల శరీరాన్ని గట్టిగా చుట్టేసి దానికి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తోంది. అప్పుడే ఆ ఉడుము పిల్ల తల్లి అటువైపు వచ్చి తన బిడ్డ పరిస్థితి చూసింది. వెంటనే దానికి పాముమీద విపరీతమైన కోపం వచ్చింది. వీడియోలో తల్లి ఉడుము(mother wild lizaed) పాము మీద దాడి చేయడం చూడచ్చు. ఆ పాము ఒకవైపు ఉడుము పిల్లను బంధించి మరొకవైపు తల్లి ఉడుము మీద దాడి చేయాలని చూస్తుంది. అయితే తల్లి ఉడుము కోపం ముందు అది నిలబడలేకపోయింది. తల్లి ఉడుము పామును కొరికింది. ఆ పాము బాధతో విలవిలలాడుతున్న సమయంలో అదను చూసి తన బిడ్డను చుట్టుకున్న ప్రాంతం మీద దాడిచేసింది. చివరకు ఆ పాము మీద ఒక్కసారి వేగంగా దూకడంతో ఆ పాము ఉడుము పిల్లను వదిలేసింది. కానీ తల్లి ఉడుము దాడి చేసిన వేగానికి పాముతో సహా ఆ తల్లి ఉడుము కూడా ఎత్తైన బండరాళ్ళ మీద నుండి కింద పడిపోయింది. పిల్ల ఉడుము ప్రాణాలు అయితే నిలబడ్డాయి కానీ తల్లి ఉడుము అంత ఎత్తునుండి కింద పడటంతో అది బ్రతికుందనే ఆశ కలగలేదు.
Viral Video: రైతే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి.. ట్రాక్టర్ ను ఎలా మార్చేశాడో చూస్తే ..
ఈ వీడియోను Figen అనే ట్విట్టర్(Twitter) యూజర్ తన అకొంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ తల్లి ఉడుము చేసిన పోరాటాన్ని మెచ్చుకుంటున్నారు. 'తల్లి ప్రేమ ఇంతే ఉంటుంది. తనేమైపోయినా పర్వాలేదు, పిల్లలు బాగుండాలని అనుకుంటుంది' అని ఒకరు భావోద్వేగమైన కామెంట్ చేసారు. 'పైనుండి కింద పడిన ఆ తల్లి ఉడుము ఎలా ఉందో ఏంటో' అని ఇంకొకరు ఆ తల్లి ఉడుము గురించి విచారం వ్యక్తం చేశారు.
Inverter: ఇన్వర్టర్ బ్యాటరీని మీరే సొంతంగా రీఫిల్ చేస్తుంటారా? ఈ 4విషయాలు తెలుసుకోకపోతే కొంపలు మునిగినట్టే..
Updated Date - 2023-07-31T17:09:20+05:30 IST