ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వామ్మో పిల్లులకు ఇంత ధైర్యం ఉంటుందా? ఈ వీడియో చూశారంటే షాకవడం పక్కా..

ABN, First Publish Date - 2023-06-07T13:06:25+05:30

ఎక్కడైనా కుక్క కనబడితే చాలు పిల్లులు తోకముడిచి పారిపోవడం చూసుంటారు. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇష్టంగా పెంచుకునే పెంపుడు జంతువులలో పిల్లులు కూడా ఒకటి. ఇళ్ళలో ఎలుకల దాటికి తట్టుకోలేక చాలా మంది పిల్లులను పెంచుకుంటే మరికొందరు ఇష్టంగా పెంచుకుంటారు. ప్రతి ఉంట్లో పిల్లులు ఇంటి యజమానుల కాళ్ళ చుట్టూ తిరుగుతూ చిన్నపిల్లల కంటే ఎక్కువ గారాలు పోతాయి. కానీ ఎక్కడైనా కుక్క కనబడితే చాలు పిల్లులు తోకముడిచి పారిపోవడం చూసుంటారు. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు 'వామ్మో పిల్లులకు ఇంత ధైర్యం ఉంటుందా?' అని ముక్కున వేలేసుకుంటున్నారు. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

పిల్లులు(cats) చాలామంచి పెంపుడు జంతువులు. కుక్కల తరువాత పిల్లులని పెంచుకోవడానికే చాలామంది ఆసక్తి చూపిస్తారు. కొన్ని పిల్లులు చీమ చిటుక్కుమన్నా భయపడితే మరికొన్ని చాలా చురుగ్గా ధైర్యంగా ఉంటాయి. కానీ పులిని, పామును చూసి కూడా బెదరకుండా వాటిని ఎదిరించే పిల్లులను చూశారంటే మాత్రం షాకవ్వాల్సిందే. ఓ వీడియో స్టార్టింగ్ లో పిల్లి పులి బోను ముందు కూర్చుని ఉంది. పులి బోనులో(tiger cage) నుండి తల బయటకు పెట్టి పిల్లిని అందుకోవాలని చూస్తుంది. కానీ పిల్లి తన పంజాతో ఒక్కసారిగా పులికి షాటిచ్చింది. వెంటనే పులి గాండ్రుమంటూ లోపలికి వెళ్లిపోయింది. పులి బోనులో ఉంది కాబట్టి పిల్లి ప్రతాపం అని అందరూ అనుకునేలోపు పబ్లిగ్గా ఒక వాటర్ పాండ్ ఒడ్డున పిల్లి కూర్చుంది. నీళ్ళలోనుండి ఒక సీల్(seal) ఆ పిల్లి దగ్గరకు వచ్చింది. ఆ సీల్ ను కూడా పిల్లి పంజాతో ఒక్క దెబ్బ కొట్టడంతో సీల్ మెల్లిగా నీళ్ళలోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత నీటి ఒడ్డున నిలబడుకుని మొసలి మీదా అలాగే పంజాతో పంచులు ఇచ్చింది. కానీ ఆ తరువాత అందరూ షాకయ్యేలా పడగ విప్పి బుసలు కొడుతున్న పాము(Snake) పిల్లిని కాటేయడానికి వెళుతున్నా పిల్లి అస్సలు భయపడలేదు. తన పంజాతో పంచుల మీద పంచులు వేసి ఆ పామును ముప్పుతిప్పలు పెట్టింది. చివరికి పాము తోకముడిచి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఓ ఎలుగుబంటి ఇంటి కాంపౌండ్ లోకి చొచ్చుకుని వచ్చి దాడి చేయాలని చూస్తే దాన్ని తరిమికొడుతుంది ఓ పిల్లి. ఇలా పిల్లులు చాలా దైర్యం ప్రదర్మించిన సందర్భాలన్నీ కలిపి ఓ వీడియోగా రూపొందించారు.

Viral News: UPSC ఇంటర్యూ ప్రశ్న గురించి IFS ఆఫీసర్ పోస్ట్.. మీరేం సమాధానం చెబుతారంటూ ఛాలెంజ్.. ఇంతకీ ఆయన సమాధానం ఏమిటంటే..


ఈ వీడియోను The Best అనే ట్విట్టర్ అకౌంట్(Twitter account) నుండి షేర్ చేశారు. Cats are fearless అనే క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. 'నిజమే పిల్లులు ధైర్యంగా ఉంటాయి' అని కొందరు కామెంట్స్ చేశారు. 'నా పెంపుడు పిల్లి ఇంత ధైర్యంగా ఉంటే ఎంత బాగుండునో' అని ఒకరన్నారు. 'ఆ పిల్లి ధైర్యమేదో కుక్కముందు చూపించాల్సింది' అని సెటైర్లు వేస్తున్నారు. 'ఆ ఎలుగుబంటిని తమిరికొట్టడం నిజంగా చాలా అద్భుతం, ఆ పిల్లి దైర్యానికి హ్యాట్సాప్' అని మరికొందరు కామెంట్స్ చేశారు.

Viral News: ఈ ఫొటోలోని రాయి నీళ్లల్లో ఉందా..? గాల్లో తేలుతోందా..? చూడగానే చెప్పగలిగితే మీరు గ్రేటే..!


Updated Date - 2023-06-07T13:06:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising