Viral Video: అర్ధరాత్రి కారులో తిరుగుతూ యువతుల వింత నిర్వాకం.. వాళ్లు చేసిన పనేంటో తెలిస్తే..
ABN, First Publish Date - 2023-11-16T15:59:12+05:30
అర్ధరాత్రి కార్లలో తిరుగుతూ ఈ యువతులు చేసిన నిర్వాకం చూస్తే..
"డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్" అని ఓ ఇంగ్లీషు సామెత ఉంది. "పుస్తక ముఖ చిత్రం చూసి ఆ పుస్తకం గురించి నిర్ణయించకండి" అనేది దీని అర్థం. ఈ సామెతను చాలావరకు వ్యక్తులకు అన్వయించి చెబుతుంటారు. మనుషులు పైకి కనిపించినట్టు లోపల ఉండరనే ఉద్దేశ్యంలో దీన్ని వాడుతుంటారు. ఈ యువతులకు ఇది అతికినట్టు సరిపోతుంది. అర్ధరాత్రి కార్లలో తిరుగుతూ వీరు చేసిన నిర్వాకానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. "మీకిదేం పాడుబుద్ది తల్లీ" అని తిట్టిపోస్తున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
పంజాబ్(Punjab) రాష్ట్రం మొహలీలో ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు అర్ధరాత్రులలో ఇళ్లకు కన్నాలు వేసి దొంగతాలు చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం జనాల అభిరుచి మారింది. వీడియోలో మొహాలీలోని సెక్టార్ 78 లో ఉన్న ఓ ఇంటి ముందు అర్దరాత్రి సమయంలో ఓ కారు ఆగడం చూడచ్చు. ఆ కారులోనుండి ఇద్దరు యువతులు దిగుతారు. వారు అటు ఇటూ గమనిస్తూ ఆ ఇంటి కాంపౌండ్ మీద ఉంచిన పూలకుండీలు చేతుల్లో తీసుకుని కారెక్కి, కారును స్టార్ట్స్ చేస్తారు. కానీ ఆ కారు కొంచెం ముందుకు వెళ్లగానే ఉన్నట్టుండి కారును ఆపుతారు. ఓ అమ్మాయి మళ్లీ వెనక్కు వచ్చి ఇంకొక పూల కుండీ తీసుకుని వెళతుంది. కొంచెం సేపటి తరువాత మరో ఇద్దరమ్మాయిలు వచ్చి ఆ కాంపౌండ్ గోడ మీద ఉన్న మిగిలిన మొక్కల కుండీలు కూడా తీసుకెళ్లిపోతారు. ఇలా అక్కడ కుండీలే లేకుండా మొండి గోడ మిగులుస్తారు(girls theft plant midnight from a house firewall). ఈ ఏడాది ప్రారంభంలో గురుగ్రామ్ లో జి-20 సదస్సు జరిగింది. ఆ సమయంలో అలంకరించేందుకు రోడ్డుమీద పూలమొక్కలు ఉంచారు. అప్పుడు ఆ పూలమొక్కలను దొంగిలించారు. అప్పటి నుండి ఇలా పూల మొక్కలు కూడా దొంగిలించడం జరుగుతోంది. ఈ యువతులు దర్జాగా కారులో వచ్చి మరీ పూల మొక్కలు దొంగతనం చేయడం చూసి నెటిజన్లు విస్తుపోతున్నారు. ఇంటికి అమర్చిన సిసికెమెరాలో ఈ సంఘటన మొత్తం రికార్డ్ కావడంతో ఇది బయటకొచ్చింది.
ఇది కూడా చదవండి: Viral Video: ఇంత ట్యాలెంటెడ్ గా ఉన్నావేంటి బ్రో.. టెస్లా కారును ఇతడెలా మార్చేశాడో చూస్తే..
ఈ వీడియోను Gagandeep Singh అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. దొంగతనానికి సంబంధించి సంఘటనను క్యాప్షన్ లో మెన్షన్ చేశారు. అమ్మాయిలు దొంగతనం చేస్తున్న సంఘటన వీడియోలో స్పష్టంగా కనిపిస్తుండటంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు. 'లక్షలు పోసి కార్లు కొంటారు కానీ వందలు పెట్టి మొక్కలు మాత్రం కొనలేరా? రిచ్ కిడ్స్ చేసే దొంగతనాలు ఇలాగే ఉంటాయేమో' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఆ అమ్మాయిలు చాలా చెడ్డ పని చేస్తున్నారు. వారి తల్లిదండ్రులు డబ్బు సంపాదించి కార్లు కొన్నట్టున్నారు కానీ పిల్లలకు మంచి బుద్దులు నేర్పించలేదు' అని మరొకరు అన్నారు.
ఇది కూడా చదవండి: Raisins: ఎండుద్రాక్ష నానబెట్టి తినాలా?
Updated Date - 2023-11-16T15:59:14+05:30 IST