ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: బస్సులు, ఆటోల కన్నా ఏడుగురు కూర్చోగలిగే ఈ వెరైటీ బైక్ చాలా బెటర్.. ఈ కుర్రాడి క్రియేటివిటీకి సలాం కొడుతున్న నెటిజన్లు..!

ABN, First Publish Date - 2023-04-27T14:46:16+05:30

కామన్ మ్యాన్ ట్యాలెంట్ గురించి సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు సెవెన్ ఈ సీటర్ బైక్ చూస్తే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ట్యాలెంట్ ఎవరి సొత్తూ కాదు. అద్భుతమైన వస్తువుల ఆవిష్కరణ పెద్ద కంపెనీలు, ఇంజనీర్లకు మాత్రమే సాధ్యమవుతుందని అనుకుంటే పొరపాటు. కామన్ మ్యాన్ ట్యాలెంట్ గురించి సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు మరొక వీడియో అందరనీ ఆకర్షిస్తోంది. బస్సులు, ఆటోల కంటే ఈ బెైక్ చాలా బెటర్ అంటున్నారు దీన్ని చూసిన నెటిజన్లు. 'నీ ట్యాలెంట్ సూపర్ బ్రదర్.. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో ఏంటో' అని అంటున్నారు. అందరినీ కట్టిపడేస్తున్న ఈ కొత్త ఆవిష్కరణ గురించి పూర్తీగా తెలుసుకుంటే..

సోషల్ మీడియా(social media) పుణ్యమా అని కామన్ మ్యాన్ ట్యాలెంట్(common man talent) అందరికీ చేరువ అవుతోంది. అద్భుతమైన ఆవిష్కరణలు పెద్ద పెద్ద కంపెనీలకు, ఇంజనీర్లకే సాధ్యమని అనుకుంటారు. కానీ అది తప్పదని నిరూపిస్తున్నారు కొందరు కుర్రాళ్ళు. ఓ కుర్రాడు సెవెన్ సీటర్ బైక్(seven seater bike) ఆవిష్కరించాడు. దీని తయారీకీ అతను ఉపయోగించిందల్లా కేవలం ఇనుప పైపులు(iron pipes), కూర్చోవడానికి సైకిల్ సీట్లు(bicycle seats), ఒక బ్యాటరీ(battery). వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ వీటి సహాయంతో అతను కనిపెట్టిన ఈ సెవెన్ సీటర్ బైక్ నిజంగా అద్బుతంగా ఉంది. వీడియోలో ఇనుప పైపులతో పొడవుగా తయారు చేసిన సెవెన్ సీటర్ బైక్ మీద ఆరుమంది కూర్చుని రహదారి మీదకు వచ్చారు. ఆ సెవెన్ సీటర్ బైక్ ఓ వ్యక్తి ముందు ఆగింది. అప్పటిదాకా అక్కడ నిలబడుకుని ఓ వ్యక్తిని ఆ సెవెన్ సీటర్ బైక్ మధ్యలో ఖాళీగా ఉన్న ఒక సీటులో కూర్చోమని లిఫ్ట్ ఆఫర్ చేశారు. అతను ఆ సీటులో కూర్చోగానే ఆ బైక్ మళ్ళీ ముందుకు సాగిపోయింది. ఇదంతా రహదారి మీద వెళ్తున్నవారు విడ్డూరంగా నిలబడి చూశారు. కేవలం ఇనుప పైపులతో తయారు చేసిన ఈ బైక్ ముందుభాగం సైకిల్ హ్యాండిల్ లాగా ఉంది. సైకిల్ సీట్లలో కూర్చోవడానికి అనువుగా ఉంది. దీనికి ముందొక టైర్ వెనుక ఒక టైర్ సెట్ చేశారు. ఈ సెవెన్ సీటర్ బైక్ వెనుక బ్యాటరీ ఏర్పాటు చేశారు. ఈ బైక్ పూర్తీగా బ్యాటరీ సహాయంతో నడుస్తోంది. కాబట్టి దీనికి పెట్రోల్ ఖర్చవుతుందనే బాధ కూడా లేదు. ఈ కారణం వల్ల నెటిజన్లకు ఈ బైక్ చాలా నచ్చేస్తోంది.

Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవాళ్లంతా తప్పక తెలుసుకోవాల్సిన విషయమిది.. అందరూ కామన్‌గా చేసే ఈ మిస్టేక్ వల్లే..!


ఈ వీడియోను offical_sandeep_bdt23 అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఇది రాజస్థాన్(Rajasthan) ప్రాంతమని కొందరు అంటున్నా సరైన క్లారిటీ లేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ సెవెన్ సీటర్ బైక్ పట్ల ఆకర్షితులవుతున్నారు. దీన్ని కనిపెట్టిన కుర్రాడి ట్యాలెంట్ కు ఫిదా అవుతున్నారు. 'నీ ట్యాలెంట్ కు హ్యాట్సాఫ్ బ్రదర్..' అని సలాం చేస్తున్నారు. 'తమకు అందుబాటులో ఉన్న వస్తువులతో అద్భుతం చేయడం భారతీయులకు వెన్నతో పెట్టిన విద్య' అని మరికొందరు అంటున్నారు.

Viral Video: ఈ వికలాంగుడికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. జొమాటోలో డెలివరీ బాయ్‌గా కొత్త జర్నీ స్టార్ట్.. ట్రై సైకిల్‌పై వెళ్తూనే..


Updated Date - 2023-04-27T14:46:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising