ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఒట్టి చేతులతో.. ఒకేసారి 13 బీర్ గ్లాసులను తీసుకెళ్లడం సాధ్యమా..? ఈ యువతి టాలెంట్‌కు ఫిదా అవడం ఖాయం..!

ABN, First Publish Date - 2023-09-25T15:45:02+05:30

హోటల్స్ లేదా రెస్టారెంట్లలో పని చేసే వారు చాలా చురుగ్గా ఉండాలి. కస్టమర్లకు వేగంగా సర్వీస్ అందిస్తూ వారిని ఆకట్టుకోవాలి. వెయిటర్లు లేదా వెయిట్రస్‌లు కస్టమర్లను ఆకట్టుకోవడానికి రకరకాల ట్రిక్‌లను ఉపయోగిస్తారు. కొందరు అమోఘమైన ట్యాలెంట్ ప్రదర్శిస్తారు.

హోటల్స్ (Hotels) లేదా రెస్టారెంట్ల (Restaurants)లో పని చేసే వారు చాలా చురుగ్గా ఉండాలి. కస్టమర్లకు వేగంగా సర్వీస్ అందిస్తూ వారిని ఆకట్టుకోవాలి. వెయిటర్లు లేదా వెయిట్రస్‌లు (Waitresses) కస్టమర్లను ఆకట్టుకోవడానికి రకరకాల ట్రిక్‌లను ఉపయోగిస్తారు. కొందరు అమోఘమైన ట్యాలెంట్ ప్రదర్శిస్తారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే బార్‌లో పని చేస్తున్న ఓ యువతి ట్యాలెంట్‌కు ఫిదా కావాల్సిందే. ఆమె నిండుగా ఉన్న 13 పెద్ద బీర్ గ్లాస్‌లను ఒకేసారి తీసుకెళ్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

@TansuYegen అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. జర్మనీలోని మ్యూనిచ్‌లో ఉన్న ఓ బార్‌లో వెయిట్రస్‌కు సంబంధించిన వీడియో అది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మహిళ బార్ కౌంటర్ దగ్గర నిలబడి బీర్ గ్లాస్‌లను సేకరిస్తోంది. ఆమె ఒకేసారి ఏకంగా 13 నిండుగా ఉన్న బీర్ గ్లాస్‌లను (13 Beer Glasses) చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ కస్టమర్లకు అందించడానికి తీసుకెళ్లింది. ఆమె ట్యాలెంట్‌కు ఫిదా అయిన ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Shocking: 4 రోజులుగా అదృశ్యం.. సడన్‌గా యజమానికి ఫోన్‌.. మీ పొలంలో ఓ పెట్టెను పూడ్చిపెట్టానంటూ కొత్త ట్విస్ట్.. తవ్వి చూస్తే..!

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోను ఇప్పటివరకు ఏకంగా 1.8 కోట్ల మంది వీక్షించారు. 2 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఆమె ట్యాలెంట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ``ఆమె చేతుల్లో చాలా బలం ఉంది``, ``ఈ ఫీట్ అందరికీ సాధ్యం కాదు``, ``అమోఘం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-09-25T15:45:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising