Viral Video: రోడ్డు పక్కన పానీ పూరీ తినే అలవాటుందా..? ఒక్కసారి ఈ వీడియోను చూడండి..!
ABN, First Publish Date - 2023-09-15T18:25:20+05:30
మనదేశంలో పానీపూరీలను ఇష్టపడని వారు అంటూ ఎవరూ ఉండరు. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ కచ్చితంగా ఈ స్నాక్ దొరుకుతుంది. అయితే ఈ స్ట్రీట్ ఫుడ్ విషయంలో అందరూ ఆందోళన చెందేది మాత్రం పరిశుభ్రత విషయంలోనే.
మనదేశంలో పానీపూరీలను (PaniPuri) ఇష్టపడని వారు అంటూ ఎవరూ ఉండరు. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ కచ్చితంగా ఈ స్నాక్ దొరుకుతుంది. రోడ్డు పక్కన పానీపారీ స్టాల్స్ ముందు ప్లేట్లు పట్టుకుని నిల్చునే వారు నిత్యం కనబడుతూనే ఉంటారు. అయితే ఈ స్ట్రీట్ ఫుడ్ విషయంలో అందరూ ఆందోళన చెందేది మాత్రం పరిశుభ్రత విషయంలోనే. పానీపూరీలో వేసే పానీ మంచిది కాదని, విక్రయించే వారు నీట్‌గా ఉండరని చాలా మంది చెబుతుంటారు. అది నిజమే అయినా ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే ఆ ఆందోళన కాస్త తగ్గుతుంది (PaniPuri Making).
the__bearded__foodie అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ అయిన ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోను గుజరాత్ (Gujarat)లోని సూరత్‌లో ఓ ఫ్యాక్టరీలో రికార్డు చేశారు. ఆ వీడియోలో పానీపూరీలను పూర్తిగా యంత్రాలతోనే తయారు చేశారు. ఎక్కడా అపరిశుభ్రత కనిపించలేదు. అసలు ఆ తయారీ ప్రక్రియలో ఎక్కడా మనుషుల ప్రమేయమే కనిపించలేదు. చాలా ఆరోగ్యకరంగా పానీపూరీలను తయారు చేసే విధానం అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
Amazon: అమెజాన్ నుంచి ఇంపార్టెంట్ అప్డేట్.. సెప్టెంబర్ 19వ తారీఖు నుంచి అమల్లోకి కొత్త రూల్..!
వైరల్ అవుతున్న ఆ వీడియోను దాదాపు 2.5 లక్షల మంది వీక్షించారు. ఎంతో మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``పానీపూరీలను చాలా ఆరోగ్యకరంగా తయారు చేశారు``, ``భారతదేశంలో మాత్రమే తినదగిన పానీపూరీ``, ``క్లీనెస్ట్ పానీపూరీ``, ``నిజానికి పానీపూరీకి అసలు రుచి చెమట, ధూళి నుంచి మాత్రమే వస్తుంది``, ``నాకు పానీపూరీలంటే చాలా ఇష్టం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
Updated Date - 2023-09-15T18:25:20+05:30 IST