ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఈ ఏనుగు ఎంత తెలివైందో చూడండి.. కాలికి ఫెన్సింగ్ గుచ్చుకుంటోందని ఎలాంటి ప్లాన్ వేసిందంటే..

ABN, First Publish Date - 2023-09-18T19:24:21+05:30

ఈ భూమిపై అత్యంత తెలివైన జంతువులలో ఏనుగులు కూడా ఒకటి. తమకు ఎదురయ్యే సమస్యలను ఏనుగులు తెలివితో అధిగమిస్తాయి. ఏనుగుల తెలివితేటలకు సంబంధించిన ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఈ భూమిపై అత్యంత తెలివైన జంతువులలో ఏనుగు (Elephant) కూడా ఒకటి. తమకు ఎదురయ్యే సమస్యలను ఏనుగులు తెలివితో అధిగమిస్తాయి (Cleverness of the elephant). ఏనుగుల తెలివితేటలకు సంబంధించిన ఎన్నో వీడియోలు (Elephant Videos) ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. IFS అధికారి సుశాంత నంద ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. ఆ వీడియో (Viral Video) సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ (Fencing)ను దాటేందుకు ఓ ఏనుగు ప్రయత్నిస్తోంది. ముందుగా తన కాలితో ఆ ఫెన్సింగ్ స్థంభాన్ని పడగొట్టింది. ఆ తర్వాత ఐరన్ ఫెన్సింగ్‌పై కాలు వేసింది. అది గుచ్చుకోవడంతో ఏనుగు వెనక్కి తగ్గింది. వెంటనే పక్కనే ఉన్న ఓ చెట్టును పడగొట్టి ఆ ఫెన్సింగ్‌పై వేసింది. ఆ చెట్టుపై కాళ్లు వేసి చాలా జాగ్రత్తగా ఫెన్సింగ్‌ను దాటేసింది. ఆ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Shocking: చేపలు ఎక్కువగా తింటుంటారా? ఫిష్ తిని కాళ్లు, చేతులు పోగొట్టుకున్న మహిళ.. అసలు కథేంటంటే..

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 47 వేల మంది ఆ వీడియోను వీక్షించారు. ఆ ఏనుగు తెలివితేటలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ``అద్భుతమైన మనస్సు, అమోఘనమైన తెలివి``, ``ఇంటెలిజెంట్``, ``ఏనుగు తెలివితేటలు అద్భుతం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-09-18T19:24:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising