Water Drinking Rules: నిలబడి మంచినీళ్లను తాగకూడదా..? అసలు మంచినీళ్లను ఎలా తాగాలని ఆయుర్వేదంలో రాసి ఉందంటే..!
ABN, First Publish Date - 2023-11-03T17:12:14+05:30
పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీరు తాగడం మంచిదని ఓ సామెత ఉంది. కానీ అసలు నిలబడి నీళ్లు తాగడం గురించి ఆయుర్వేదం ఏం చెబుతోందంటే..
నీరు మనిషి నుండి మొక్కల వరకు ప్రతి ఒక్కరికి అవసరం. నీరు త్రాగకుండా మహా అయితే కొన్ని గంటలు ఉండగలం. కానీ రోజుల తరబడి నీరు తాగకపోతే క్రమంగా శరీరంలో ఒక్కో అవయవం పనితీరు మందగించి ప్రాణాలు పోవడానికి దారి తీస్తుంది. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీరు తాగడం మంచిదని ఓ సామెత ఉంది. చాలా ఇళ్లలో నీరు తాగే సీన్ గమనిస్తే ఫ్రిజ్ ల దగ్గరా, కుండల నుండి నీటిని ఒంపుకుని అక్కడికక్కడ నిలబడుకునే నీరు తాగుతుంటారు. కానీ ఆయుర్వేదం ఇలా నిలబడుకుని నీళ్లు తాగడాన్ని మహా చెడ్డ అలవాటుగా చెబుతోంది. అసలు ఆయుర్వేదం ప్రకారం నీరు తీసుకోవడంలో ఉన్న రూల్స్ ఏంటి?(Rules to drink water in Ayurveda).నిలబడి నీరు తాగితే జరిగేదేంటి? పూర్తీగా తెలుసుకుంటే..
నీటి పరిమాణం.. (Water amount)
ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఒక్కరూ రోజులో 7 నుండి 8 గ్లాసుల నీటిని తాగాలి. ఇంత కంటే తక్కువ నీరు తాగితే శరీరం డీహైడ్రేట్ కు లోనవతుంది. శరీరంలో నీటి కొరత వల్ల అనేక రోగాలు వస్తాయి.
Read Also: Dirty Neck: మెడ దగ్గర నల్లగా అసలు ఎందుకు అవుతుంది..? మళ్లీ మామూలుగా అక్కడ చర్మం మారిపోవాలంటే..!
గోరువెచ్చని నీరు..(luke warm water)
చాలామంది వాతావరణాన్నిఅనుసరించి నీటిని కూడా మారుస్తుంటారు. వేసవిలో చల్లని నీరు, చలికాలంలో వెచ్చగా ఉన్న నీరు తాగుతారు. కానీ ఏడాది పొడవునా గోరు వెచ్చని నీరు తాగడం శ్రేయస్కరమని ఆయుర్వేదం చెబుతోంది. చల్లని నీరు తాగడం వల్ల ఎముకలకు చాలా నష్టం చేకూరుతుంది. అదే గోరు వెచ్చని నీరు శరీరాన్నిమమర్థవంతంగా డిటాక్సిఫై చేస్తుంది. జీవక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.
నిలబడి నీళ్లు తాగకూడదు..( stop drinking water while standing)
చాలామంది నీటిని బిందెల్లోనూ, కుండల నుండి తీసుకుని, ఫ్రిజ్ నుండి బాటిళ్ళు తీసుకుని అక్కడికక్కడే నిలబడుకుని నీటిని తాగుతారు. కానీ ఆరోగ్యానికి ఈ పద్దతి పూర్తీగా విరుద్దం. ఇలా నిలబడుకుని నీరు తాగడం వల్ల శరీరంలో ద్రవాల సమతుల్యత దెబ్బితింటుంది. ఇది కీళ్ల నొప్పుల వంటి తీవ్రమైన వ్యాధులకు కారణం అవుతుంది.
ఒకేసారి తాగకూడదు.. (large amount in one sip)
నీరు తాగడం మొదలు పెట్టారంటే ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా ఒక్కసారే గ్లాసుల కొద్దీ నీటిని తాగేస్తుంటారు. కానీ ఇలా ఒకేసారి ఎక్కువ మొత్తం నీటిని తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇలా తాగడం వల్ల శరీరంలో అవయవాలమీద ఒత్తిడి పెరుగుతుంది. కూర్చుని కొద్ది కొద్దిగా నీటిని తాగడం చాలా మంచిది.
ఆహారంతో నీరు తీసుకోకూడదు.. (avoid water with eating food)
ఆహారాన్ని బాగా నమిలి తింటే అస్సలు నీరు తాగాల్సిన అవసరమే లేదని ఆయుర్వేదం చెబుతుంది. లాలాజలం ఆహారంతో కలవడం వల్ల ఎలాంటి ఆటంకం ఉండదు. ఆహారం తీసుకోవడానికి గంట ముందు లేదా గంట తరువాత మాత్రమే నీటిని పుష్కలంగా తాగాలి. ఒక వేళ ఆహారం తినేటప్పుడు నీరు అవసరం అయితే కేవలం అరగ్లాసు నీరు తాగవచ్చు. అంతకుమించి నీరు తాగడం జీర్ణాశయానికి ఇబ్బంది కలిగిస్తుంది.
Read Also: Weight Loss in 1 Week: బానపొట్ట చొక్కాలోంచి బయటకు తన్నుకొస్తోందా..? ఈ 4 పనులను ఒక్క వారం రోజుల పాటు చేస్తే..!
Updated Date - 2023-11-03T17:12:16+05:30 IST