Viral Video: పెళ్లి విందులో ఆహ్లాదంగా భోజనం చేస్తున్న అతిథులు.. అంతలో ఏమైందో చూస్తే షాకవడం ఖాయం!
ABN, First Publish Date - 2023-09-01T16:07:05+05:30
ఓ పెళ్లి (Marriage) విందుకు (Feast) సంబంధించిన షాకింగ్ వీడియో (Shocking Video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతిథులు భోజనం చేస్తున్నప్పుడు ఊహించని విధంగా వారి మధ్య ఘర్షణ చెలరేగడంతో వివాహ వేడుక గందరగోళంగా, హింసాత్మకంగా మారింది.
ఓ పెళ్లి (Marriage) విందుకు (Feast) సంబంధించిన షాకింగ్ వీడియో (Shocking Video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతిథులు భోజనం చేస్తున్నప్పుడు ఊహించని విధంగా వారి మధ్య ఘర్షణ చెలరేగడంతో వివాహ వేడుక గందరగోళంగా, హింసాత్మకంగా మారింది. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ వీడియో వీక్షకులను దిగ్భ్రాంతికి గురిచేసింది.@SabjiHunter అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Wedding dinner turns violent).
వైరల్ అవుతున్న ఆ వీడియో మొదట చాలా ఆహ్లాదంగా ప్రారంభమైంది. అతిథులు (Guests) పెళ్లి విందులో ఏర్పాటు టేబుల్‌ల వద్ద కూర్చుని ఆనందంగా భోజనం చేస్తున్నారు. అంతలో అకస్మాత్తుగా ఒక గుర్తు తెలియని వ్యక్తి అక్కడకు వచ్చి భోజనం చేస్తున్న ఓ అతిథిపై చేయి చేసుకున్నాడు. దీంతో గందరగోళం మొదలై హింసాత్మక మలుపు తీసుకుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న వారిలో చాలా మంది ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆహ్లాదకరంగా మొదలైన పెళ్లి విందు చివరకు రసాబాసగా మారింది. ఈ వీడియో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
Viral Video: తొండాన్ని చూసి ఆశ్చర్యపోతున్న బుల్లి ఏనుగు.. వైరల్ అవుతున్న క్యూట్ వీడియో!
ఈ ఘటన పాకిస్థాన్‌లో జరిగిందని కొందరు, బ్రిటన్‌లో జరిగిందని కొందరు చెబుతున్నారు. అయితే స్పష్టంగా ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఈ వీడియోను ఇప్పటివరకు 68 వేల మంది వీక్షించారు. ఈ వీడియోపై చాలా మంది తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``చాలా విచిత్రంగా ఉంది``, ``షాకింగ్ వీడియో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-09-01T16:08:27+05:30 IST