ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Weight Loss in 1 Week: బానపొట్ట చొక్కాలోంచి బయటకు తన్నుకొస్తోందా..? ఈ 4 పనులను ఒక్క వారం రోజుల పాటు చేస్తే..!

ABN, First Publish Date - 2023-11-03T15:37:54+05:30

కేవలం నాలుగే నాలుగు పనులు చేయడం వల్ల ఎంత బరువు ఉన్నవారు అయినా వారంలో ఈజీగా 3నుండి 4 కేజీల బరువు తగ్గవచ్చు.

భారతదేశంలో అధికబరువు అనే సమస్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అధికబరువు వల్ల బోలెడు ఆరోగ్య సమస్యలు వస్తాయనే విషయం తెలిసిందే. అన్నింటికంటే ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారు ఏం తినాలన్నా, తాగాలన్నా చాలా భయపడుతుంటారు. ఇంకా బరువు పెరుగుతామేమో అనే ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ ఒత్తిడి కారణంగా సమస్య మరింత పెరుగుతుంది. ఇక అధిక బరువుకు కేరాఫ్ అడ్రస్ గా బానలాంటి పొట్ట దుస్తులలో నుంచి ముందుకు వచ్చి అధికబరువును మరింత తీవ్రంగా వెల్లడిస్తుంది. కేవలం నాలుగే నాలుగు పనులు చేయడం వల్ల ఎంత బరువు ఉన్నవారు అయినా వారంలో ఈజీగా 3నుండి 4 కేజీల బరువు తగ్గవచ్చు(Easy weight loss tips). అవేంటో తెలుసుకుంటే..

నీరు బాగా తాగాలి..(Water)

నీరు శరీరానికి చాలా అవసరం. రోజువారీ పనుల హడావిడిలో చాలామంది శరీరానికి సరిపడినంత నీటిని తాగరు. రోజులో 7నుండి 9 గ్లాసుల నీరు తప్పనిసరిగా తీసుకోవాలి. నీరు బాగా తాగితే శరీరంలో టాక్సిన్ లు సులువుగా బయటకు వెళ్లిపోతాయి. జీవక్రియ కూడా మెరుగ్గా ఉంటుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

Read Also: Dengue: ఏ ఆస్పత్రిలో చూసినా డెంగ్యూ రోగులే.. డాక్టర్లు ఇచ్చే మెడిసిన్సే కాదండోయ్.. ఈ వంటింటి చిట్కాలూ డెంగ్యూను తగ్గిస్తాయ్..!



నడక..(Walking)

ఉదయమో, సాయంత్రమో నడవడం అందరూ చేస్తారు. కానీ బరువు పెరగడానికి ప్రధాన కారణం ఆహారం తీసుకున్న తరువాత నిద్రపోవడం లేదా కూర్చునే ఉండటం. అలా కాకుండా ఆహారం తీసుకున్న తరువాత తేలికపాటి నడక చాలా అవసరం. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

ఆహారం..(food )

బరువు తగ్గాలని అనుకునేవారు ఆహారం విషయంలో చాలా గందరగోళానికి గురవుతారు. బరువు తగ్గేప్రక్రియ చాలా వరకు తీసుకునే ఆహారం మీదనే ఆధారపడి ఉంటుంది. బయటి ఆహారాలు, ప్యాక్డ్ ఫుడ్స్, కల్తీ ఆహారాలు, నూనె ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం మానేయాలి. వీటి స్థానంలో ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, సహజమైన తీపి పదార్థాలు తినాలి.

ఉప్పు..(salt)

ఉప్పుకు, అధిక బరువుకు మధ్య సంబంధం గురించి చాలామందికి తెలియదు.కానీ అధికంగా ఉప్పు తింటే బరువు పెరుగుతారు. దీని వెనుక కారణం సోడియం శరీరంలో నీటిని పీల్చుకోవడమే. ఉప్పు ఎక్కువ తిన్నప్పుడు శరీరంలో నీటిని ఉప్పు పీల్చుకుంటుంది. దీని వల్ల శరీరం ఉబ్బినట్టు కనిపిస్తుంది. ఉప్పు ఎక్కువ ఉన్నఆహారాలు తిన్నప్పుడు అతిగా దాహం వేయడం వెనుక కారణం కూడా ఇదే. ఈ నాలుగు పనులను లైఫ్ స్టైల్ లో సరిచేసుకుంటే కేవలం వారం రోజుల్లోనే 3-4కేజీల బరువు ఈజీగా తగ్గుతారు.

Read Also: Dirty Neck: మెడ దగ్గర నల్లగా అసలు ఎందుకు అవుతుంది..? మళ్లీ మామూలుగా అక్కడ చర్మం మారిపోవాలంటే..!


Updated Date - 2023-11-03T15:37:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising