Weight Loss Mistakes: బరువు తగ్గాలని ప్రయత్నించేవాళ్లు.. పొరపాటున కూడా ఈ 7 ఆహార పదార్థాలను పొద్దున్నే తినకండి..
ABN, First Publish Date - 2023-07-18T12:01:48+05:30
కామన్ గా అందరూ ఉదయాన్నే తీసుకునే ఈ 7ఆహారాలు బరువు తగ్గే ప్రాసెస్ కు బ్రేకులు వేస్తాయి. పైపెచ్చు బరువు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా బూడిదలో పోసిన పన్నీరే..
ఇప్పట్లో అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య అధిక బరువు. పిల్లలు పెద్దలతో సంబంధం లేకుండా ఈ సమస్య అందరినీ వేధిస్తోంది. అయితే ఈ అధిక బరువు నుండి విముక్తి పొందాలని ప్రయత్నించేవాళ్ళు కూడా ఎక్కువే. కానీ సమస్యల్లా తీసుకునే ఆహారం విషయంలో తెలియకుండానే పొరపాట్లు చేయడం. తేలికగా, పోషకాలతో నిండిన ఆహారం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కానీ తక్కువ మొత్తమే తిన్నా కేలరీలు పుష్కలంగా ఉన్న ఆహారాలు బరువు తగ్గడానికి సహాయపడకపోగా ఇంకా పెరగడానికి సహకరిస్తాయి. కామన్ గా అందరూ ఉదయాన్నే తీసుకునే ఈ 7ఆహారాలు బరువు తగ్గే ప్రాసెస్ కు బ్రేకులు వేస్తాయి. పైపెచ్చు బరువు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా బూడిదలో పోసిన పన్నీరే.. అందుకే పొరపాటున కూడా ఈ 7ఆహారాలు ఉదయాన్నే తినొద్దంటున్నారు ఆహార నిపుణులు.. ఇంతకూ ఆ ఆహారపదార్థాలు ఏంటో తెలుసుకుంటే..
పెరుగు..(curd)
పెరుగులో ప్రోబయేటిక్, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఉదయాన్నే అల్పాహారంలో భాగంగా పెరుగు తింటే కడుపులో ఉన్న ఆమ్లాలు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను చాలా సులువుగా నాశనం చేస్తాయి. ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా శరీరానికి ఉపయోగపడకుండా చేస్తుంది. ఈ బాక్టీరియా లేకపోతే రోజు మొత్తం తీసుకునే ఆహారం జీర్ణం కావడంలో సమస్యలు తలెత్తుతాయి.
ఆయిల్ ఫుడ్స్..(Oil foods)
వడ, పూరీ, పుణుగులు, మైసూర్ బోండా, నూనె ఎక్కువగా వేసి చేసే దోశలు వంటి అల్పాహారాలు సాధారణంగానే బరువు పెరగడానికి దారితీస్తాయి. అయితే ఉదయాన్నే ఇవి తింటే శరీరం తొందరగా డీహైట్రేట్ కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణంగా బరువు తగ్గడం కుదరదు.
Viral Video: బాగా ఆకలిగా ఉన్న చిరుత వేట ఎలా ఉంటుందో తెలుసా? ఈ వీడియో చూస్తే గుండెలు అదురుతాయి..
చక్కెర పదార్థాలు..(sugar foods)
ఉదయాన్నే చక్కెర అధికంగా ఉన్న ఆహారాలు తినడం కూడా బరువు తగ్గే ప్రయత్నాలు బెడిసికొట్టేలా చేస్తుంది. చక్కెర అధికంగా ఉన్న ఆహారాలు కడుపులో ఫ్రక్టోజ్ పెరగడానికి కారణం అవుతుంది. ఈ కారణంగా ఇన్సులిన్ వ్యవస్థ దెబ్బతింటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణ తప్పుతాయి.
సిట్రస్ పండ్లు..(citrus fruits)
సాధారణంగా సిట్రస్ పండ్లైన నిమ్మ, నారింజ బరువు తగ్గడంలో సహాయపడతాయి. వీటితో పాటు ఇతర పుల్లని పండ్లు కూడా ఉదయాన్నే తీసుకోవడం వల్ల లాభాలకంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. కడపులో యాసిడ్స్ ఉత్పత్తిని పెంచుతాయి. గుండెల్లో మంట, ఛాతీ బరువుగా అనిపించడం వంటి ఇతర సమస్యలు వస్తాయి.
స్పైసీ ఫుడ్స్..(Spicy foods)
కారం ఎక్కువగా తినేవారు బలంగా ఉంటారని కొన్ని ప్రాంతాల్లో నమ్ముతారు. కానీ ఉదయాన్నే కారం ఎక్కువగా ఉన్న పదార్థాలు తినకూడదు. ఇవి పేగు వ్యవస్థను దెబ్బతీస్తాయి. జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలు తొందరగా రావడంలో సహాయపడతాయి.
శీతల పానీయాలు..(Cool drinks)
ఉదయాన్నే చల్లగా ఏదైనా తాగాలని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. ఈ కారణంగా ఫ్రిజ్ లో స్టోర్ చేసుకున్న కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. అయితే తాగినప్పుడు చల్లగా ఉన్నా ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఈ కారణంగా శరీరంలో ఉన్న శక్తి మొత్తం తగ్గిపోతుంది. రోజంతా నీరసంగా ఉండటానికి కారణం అవుతుంది.
Viral Video: నడిసముద్రంలో షాకింగ్ సీన్.. నీళ్లలో మునిగిపోతూ కనిపించిన గ్రద్ద.. ఆ తరువాత జరిగిందేంటో చూస్తే..
Updated Date - 2023-07-18T12:01:48+05:30 IST