ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Weight Loss Tips: బరువు తగ్గేందుకు ట్రై చేయడం మంచిదే కానీ.. ఈ 8 తప్పుల్లో ఏ ఒక్కటి చేసినా..!

ABN, First Publish Date - 2023-08-10T17:52:19+05:30

బరువు తగ్గడం కోసం సీరియస్ గా ట్రై చేసేవారు ఈ 8 తప్పులు చేసారంటే మాత్రం..

జబ్బులేమీ లేకుండా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళను కూడా వైద్యుల చుట్టూ తిప్పించగలిగేంత శక్తి అధిక బరువుకు ఉంది. రక్తపోటు, అధిక కోలెస్ట్రాల్, గుండె జబ్బులు వంటి జబ్బులన్నీ అధికబరువు కారణంగా వచ్చేవే. ఆరోగ్య సమస్యలు వస్తాయని మాత్రమే కాదు, సన్నగా నాజూగ్గా ఎత్తుకు తగ్గ బరువుతో అందంగా కనిపించడం అందరికీ ఇష్టం. అందుకే బరువు తగ్గడం కోసం చాలా సీరియస్ గానే ట్రై చేస్తుంటారు. ఇందుకోసం డైటింగ్ నుండి జిమ్ చేయడం వరకు బోలెడు ఫాలో అవుతారు. ఇలా బరువు తగ్గడానికి ప్రయత్నించడం మంచిదే కానీ ఈ ప్రయత్నాలు ప్రాణాల మీదకు తెచ్చేవిగా ఉండకూడదు. ఈ కింది 8 తప్పుల్లో ఏ ఒక్కటి చేసినా బరువు తగ్గే ప్రక్రియ కాస్తా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని అర్థం. అవేంటో తెలుసుకుంటే..

అధిక కేలరీలు(high calories) కలిగిన ఆహారం తీసుకోవడం వల్లే బరువు పెరుగుతారనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు కేలరీలను తక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎంత తక్కువ కేలరీలు తీసుకుంటే అంత సులువుగా బరువు తగ్గవచ్చనే ఆలోచనతో కేలరీలు చాలా కంట్రోల్ చేస్తారు. కానీ కేలరీలు తగ్గిస్తే బరువు తగ్గడం కష్టమవుతుంది. పైపెచ్చు ఈ కారణం వల్ల పోషకాహారలోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. శారీరక బలహీనత, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు ఏర్పడతాయి.

కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే బరువు పెరుగుతారు. అందుకే ఇవి తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలని సూచిస్తారు. కానీ కార్బోహైడ్రేట్స్ అనేవి మెదడుకు శక్తి చేకూర్చడానికి ముఖ్యం. అలాగే శరీరానికి తగినంత కార్బోహైడ్రేట్లు కూడా అవసరం. అందుకే ఆరోగ్యకరమైన పద్దతిలో పరిమితంగా కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారం , బయటి ఆహారాలలో చెడు కొవ్వులు ఉంటాయి. ఇలాంటి వాటిని దూరంగా ఉంచాలి.

శరీరానికి పోషకాలు కావాలి, బరువు తగ్గాలి . ఇందుకోసం చాలామంది చేసేపని భోజనానికి బదులుగా వాణిజ్య ప్రచారాలలో చూపెట్టే ఆహారాలు కొనుగోలు చేసి తినడం. ఇక విటమిన్స్ లోపం రాకుండా ఉండేందుకు విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం. ఇవి తీసుకుంటే పోషకాహారలోపం వస్తుంది. బరువు తగ్గడానికి విటమిన్ సప్లిమెంట్స్, మీల్ రిప్లేస్మెంట్ ఉత్పత్తులు అస్సలు వాడకూడదు.

బరువు తగ్గాలని అనుకునేవారు అదే విషయానికి కట్టుబడి ఉండాలి. అంతేకానీ అప్పుడప్పుడు కాస్త ఫన్ అని, స్నేహితుల ప్రపోజల్ అని విందులు వినోదాల్లో పాల్గొంటూ ఉంటే బరువు తగ్గే ప్రక్రియ దెబ్బతినడమే కాదు మానసిక ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. అయ్యో తప్పు చేస్తున్నామే అనే ఫీలింగ్ మనిషిని కుదురుగా ఉండనివ్వదు.

R Thyagarajan: ఎవరీ పెద్దాయన..? రూ.6200 కోట్లను దానం చేసేసి.. ఓ చిన్న ఇంట్లో మకాం..!



మనిషిలో భావోద్వేగాలకు, ఆహారానికి మధ్య పెద్ద లింకే ఉంటుంది. బరువు తగ్గడానికి తీసుకునే ఆహారం ఎప్పుడూ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు. అలాగే ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ముందు మనిషి మానసిక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతో ఉంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే శారీరక అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయి.

బరువు తగ్గడానికి ఆహారం కంట్రోల్ చేస్తే సరిపోదు. శరీరంలో పేరుకున్న కోలెస్ట్రాల్ ను కరిగించాలంటే శారీరక శ్రమ చాలా ముఖ్యం. ఇప్పటితరం వారు బిజీ షెడ్యూల్ లో డైట్ ఫాలో అవుతారు కానీ శారీరక శ్రమ మాత్రం చెయ్యరు. డైట్ అనేది బరువు పెరగకుండా చేస్తుంది. ఒంట్లో కొవ్వు తగ్గాలంటే డైట్ తో పాటు శారీరక శ్రమ కూడా అవసరం.

తొందరగా బరువు తగ్గాలనే అత్యాశ ఉండకూడదు. చాలామంది ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవుతారు అంటే వివిధ పద్దతులు, వివిధ ఆహారాలు ఫాలో అవుతారు. ఈ ఫాస్ట్ వెయిట్ లాస్ పద్దతులు తాత్కాలికంగా బరువు తగ్గిస్తాయి కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చవు. ఇలా త్వరగతిన శరీరం మార్పులకు లోనయితే అది శరీరంలో అవయవాలను దెబ్బతీస్తుంది.

కొందరు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి బరువు తగ్గినా మళ్లీ కొన్ని రోజులు, వారాల వ్యవధిలోనే పెరుగుతుంటారు. బరువు తగ్గిన తరువాత అది ధీర్ఘకాలం నిలకడగా కొనసాగాలి అంటే ఆరోగ్యకరమైన పద్దతిలో బరువు తగ్గాలి. ముఖ్యంగా బరువు తగ్గాలని అనుకునేవారు పోషకాహార నిపుణులను ఒకసారి సంప్రదించి ఆ తరువాత వెయిట్ లాస్ ప్రక్రియ మొదలుపెట్టాలి.

Cow Milk vs Buffalo Milk: ఆవు పాలు మంచివా..? గేదె పాలు మంచివా..? ఆరోగ్యానికి ఏది మంచిదో అసలు నిజాలివీ..!


Updated Date - 2023-08-10T17:52:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising