Viral: ఏం ప్లాన్ వేశావు తమ్ముడూ.. స్టేడియం నుంచి డైరెక్ట్‌గా తల్లికి మెసేజ్.. అదేంటో తెలిస్తే నవ్వాగదు..
ABN, First Publish Date - 2023-10-20T17:54:03+05:30
ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రికెట్ ప్రపంచకప్ ఫీవర్ అలముకుంది. క్రికెట్ ప్రేమికులందరూ భారత్ మ్యాచ్ ఉన్న రోజూ టీవీలకు అతుక్కుపోతున్నారు. మరికొందరు స్టేడియాలకు వెళ్లి నేరుగా మ్యాచ్ చూస్తున్నారు. తాజాగా పుణెలో భారత్, ఆఫ్గాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో ఓ వ్యక్తి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రికెట్ ప్రపంచకప్ (World Cup2023) ఫీవర్ అలముకుంది. క్రికెట్ ప్రేమికులందరూ భారత్ మ్యాచ్ ఉన్న రోజూ టీవీలకు అతుక్కుపోతున్నారు. మరికొందరు స్టేడియాలకు వెళ్లి నేరుగా మ్యాచ్ చూస్తున్నారు. మ్యాచ్ చూసేందుకు కొందరు ఆఫీసులకు సెలవు తీసుకుంటుండగా, మరికొందరు ఇంటి పనులను పక్కన పెట్టేస్తున్నారు. తాజాగా పుణెలో భారత్, బంగ్లాదేశ్ (India vs Bangladesh) దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో ఓ వ్యక్తి సరదాగా చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది.
వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఒక వ్యక్తి టీమిండియా జెర్సీ ధరించి ఉన్నాడు. అతడు ఓ ఫ్లకార్డుపై తన తల్లి (Mother) కోసం ఓ మెసేజ్ రాశాడు. ``అమ్మా.. ఇంటికి AJIO ప్యాకేజీ వస్తుంది. దానిని తీసుకుని జాగ్రత్తగా ఉంచు. ఫోన్ చేద్దామంటే ఇక్కడ నెట్‌వర్క్ లేదు`` అని రాశాడు. తల్లికి ఫోన్ చేసి విషయం చెబుదామంటే ఆ స్టేడియంలో నెట్‌వర్క్ లేదు. దీంతో ఆ వ్యక్తి తన బ్రెయిన్ ఉపయోగించి తల్లికి అలా మెసేజ్ (Message to Mother) పంపాడు. ఆ వ్యక్తి చేసిన పని సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Viral Video: ఐడియా బాగుంది.. కానీ, ఏ మాత్రం తేడా వచ్చినా ప్రమాదమే.. పాకిస్థాన్‌లో ఓ వ్యక్తి పిల్లలను ఎలా తీసుకెళ్తున్నాడో చూడండి..
ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది ఆ వ్యక్తి తెలివితేటలను ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు. ``తల్లి కూడా మ్యాచ్ చూస్తుందని ఆ వ్యక్తికి తెలుసు``, ``అతడు అద్భుతంగా తన బ్రెయిన్‌ను ఉపయోగించాడు``, ``ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో``, ``బ్రదర్.. నీ తెలివి తేటలు అమోఘం`` అంటూ నెటిజన్లు ఆ వ్యక్తిని మెచ్చుకున్నారు.
Updated Date - 2023-10-20T17:54:03+05:30 IST