ఎవరికీ డౌట్ రాకూడదని భార్యను పూడ్చిన చోటే మొక్కల్ని కూడా నాటిన భర్త.. 30 కిలోల ఉప్పుతో..
ABN, First Publish Date - 2023-02-05T15:53:03+05:30
నేరాలకు పాల్పడే సందర్భాల్లో పోలీసులకు దొరక్కుండా నిందితులు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు సినిమాలు, సీరియళ్లు చూసి.. అదే రకంగా నేరాలకు పాల్పడడం కూడా చూస్తుంటాం. ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. భార్యను చంపేసి..
నేరాలకు పాల్పడే సందర్భాల్లో పోలీసులకు దొరక్కుండా నిందితులు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు సినిమాలు, సీరియళ్లు చూసి.. అదే రకంగా నేరాలకు పాల్పడడం కూడా చూస్తుంటాం. ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. భార్యను చంపేసి, ఎవరికీ అనుమానం రాకూడదని ఆమెను పూడ్చిపెట్టేశాడు. అంతటితో ఆగకుండా చివరకు అతడు ఏం చేశాడంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఘజియాబాద్ రోహతా పరిధి సాలార్‌పూర్ ప్రాంతానికి చెందిన అంజు అనే మహిళకు 13ఏళ్ల క్రితం దినేష్ ప్రజాపతి అనే వ్యక్తితో వివాహమైంది. ప్రస్తుతం వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల భార్యకు ఎవరితోనే వివాహేతర సంబంధం (extramarital affair) ఉన్నట్లు దినేష్ అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఓ రోజు భార్య ఎవరితోనే ఫోన్‌లో మాట్లాడుతుండగా వెంటనే ఆమెను నిలదీశాడు. అప్పటినుంచి ఇద్దరి మధ్య తరచూ గొడవలు (quarrels) జరుగుతుండేవి. తనకు ఎవరితో.. ఎలాంటి సంబంధం లేదని భార్య ఎన్నిసార్లు చెప్పినా దినేష్ వినిపించుకోలేదు. కొన్ని నెలలుగా గొడవలు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో జనవరి 25న భార్యపై దాడి చేసి, గొంత కోసి హత్య చేశాడు. తర్వాత ఆమె మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. త్వరగా కుళ్లిపోయేలా అందులో 30కిలోల ఉప్పును (salt) వేశాడు.
అనంతరం ఎవరికీ అనుమానం రాకూడదని అదే స్థలంలో కూరగాయల మొక్కలు నాటాడు. అనంతరం తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను కూరగాయల మార్కెట్‌కు వెళ్లానని, ఇంటికి వెళ్లి చూస్తే తన భార్య కనిపించలేదంటూ కట్టు కథ చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆమె మిస్సింగ్ అయినట్లు ఎక్కడా ఆధారాలు లభించకపోవడంతో భర్తపై అనుమానం వచ్చింది. ఇటీవల అతన్ని స్టేషన్‌కి పిలిపించి, గట్టిగా విచారించారు. దీంతో చివరకు అసలు విషయం బయటపెట్టాడు. దినేష్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2023-02-05T15:53:07+05:30 IST