గ్లాసు నీరు సమర్పించి దేవుడికి పూజలు.. కోరిక నెరవేరకపోవడంతో ఆగ్రహం.. చివరకు ఓ రోజు రాత్రి..
ABN, First Publish Date - 2023-01-06T18:38:55+05:30
కొందరు దేవున్ని చిత్రవిచిత్రమైన కోరికలు కోరుతుంటారు. మరికొందరైతే సాధ్యం కాదని తెలిసినా.. వింత వింత కోరికలు కోరుకుంటుంటారు. తీరా అవి నెరవేరకపోవడంతో చివరకు మానసికంగా తీవ్ర నిరాశలో కూరుకుపోతుంటారు. ఇంకొందరు ఆ కోపాన్ని..
కొందరు దేవున్ని చిత్రవిచిత్రమైన కోరికలు కోరుతుంటారు. మరికొందరైతే సాధ్యం కాదని తెలిసినా.. వింత వింత కోరికలు కోరుకుంటుంటారు. తీరా అవి నెరవేరకపోవడంతో చివరకు మానసికంగా తీవ్ర నిరాశలో కూరుకుపోతుంటారు. ఇంకొందరు ఆ కోపాన్ని కుటుంబ సభ్యులపై చూపిస్తూ.. అందరినీ చిత్రహింసలకు గురి చేస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి.. చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. గ్లాసు నీరు సమర్పించి దేవుడికి పూజలు చేశాడు. అయితే కోరుకున్న కోరికలు నెరవేరలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరకు అతడు చేసిన పని.. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఇండోర్ పరిధి చందన్ నగర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన శుభమ్ కైత్వాస్ అనే వ్యక్తి ఇటీవల ఉద్యోగ వేటలో పడ్డాడు. అయినా అతడి ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. దీంతో గతంలో పలు దేవుళ్లకు పూజలు కూడా చేశాడు. ఇటీవల చందన్ నగర్, ఛత్రిపుర పరిధిలోని ఆలయాల్లో పూజలు (Worship in temples) చేశాడు. దేవుడికి గ్లాసు నీరు (glass of water) సమర్పించి, తన కోరికలు నెరవేర్చాలని కోరుకున్నాడు. అయితే తన కోరికలు నెరవేరకపోవడంతో దేవుడిపై కోపం పెంచుకున్నాడు.
సీసీ కెమెరాలను గమనించని పోలీసులు.. నడి రోడ్డుపై కారు ఆపి మరీ ఏం చేశారంటే..
ఓ రోజు రాత్రి చందన్ నగర్, ఛత్రిపుర ఆలయాల్లోకి చొరబడి హుండీని (Theft of hundis) చోరీ చేశాడు, అనంతరం విగ్రహాలను ధ్వంసం చేశాడు. ఉదయాన్నే ఆలయంలోకి వచ్చిన పూజారి.. అక్కడి ఘటనను చూసి షాక్ అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజీ (CCTV footage) ఆధారంగా నిందితుడిని గుర్తించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ‘‘దేవుడు ఇతరుల మాటలు వింటున్నాడు.. నా మాటలు మాత్రం వినడం లేదు.. అందుకే ఈ పని చేశా’’.. అని నిందితుడి చెప్పగానే అంతా అవాక్కయ్యారు. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - 2023-01-06T18:51:04+05:30 IST