Viral News: ఓరినాయనో.. 18 ఏళ్ల ఈ యువతి ఇలా చేసిందేంటి..? తమ్ముడితో గొడవపడి మొబైల్‌ను మింగేసింది.. మరుక్షణంలోనే..!
ABN, First Publish Date - 2023-04-06T15:43:45+05:30
ఇంట్లో పిల్లలన్నాక.. కొట్టుకోవడాలు.. అరుచుకోవడాలు.. అలకలు సహజంగా జరుగుతుంటాయి. కొంత మంది కోపం పట్టలేక చేతికి ఏది అందితే దాన్ని విసిరేస్తుంటారు. ఎక్కువగా టీవీ రిమోట్ దగ్గర గొడవలు జరుగుతుంటాయి.
ఇంట్లో పిల్లలన్నాక.. కొట్టుకోవడాలు.. అరుచుకోవడాలు.. అలకలు సహజంగా జరుగుతుంటాయి. కొంత మంది కోపం పట్టలేక చేతికి ఏది అందితే దాన్ని విసిరేస్తుంటారు. ఎక్కువగా టీవీ రిమోట్ దగ్గర గొడవలు జరుగుతుంటాయి. ఈ జాబితాలో చరవాణి కూడా చేరింది. నచ్చిన ఛానల్ పెట్టకపోయినా.. రిమోట్ ఇవ్వకపోయినా ఓ పాటి ముష్టి యుద్ధాలే చేసుకుంటారు. పిల్లలున్న ప్రతీ ఇంట్లో ఇదంతా కామన్. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
చిన్నప్పుడు తెలిసీ తెలియని వయసులో పిల్లలు నాణేలు.. బలపాలు మింగేస్తుంటారు. ఓ చిన్నపాటి గోళీ మింగేసినా మోషన్ రూపంలో బయటకు వచ్చేస్తుంటుంది. కానీ ఇప్పుడు మాట్లాడుకునే సందర్భంలో మాత్రం... ఏకంగా సెల్‌ఫోనే మింగేసిందో యువతి. ఈ సంఘటన మధ్యప్రదేశ్(Madhya Pradesh) లోని భింద్ జిల్లాలో చోటుచేసుకుంది.
తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు. కోపంలో ఒక్కోసారి ఏం చేస్తుంటారో అర్థం కాదు. అక్కాతమ్ముళ్ల మధ్య జరిగిన ఓ చిన్నపాటి ఫైటింగ్‌లో ఏకంగా మొబైల్‌నే అమాంతం మింగేసింది. ఆ తర్వాత విపరీతమైన కడుపునొప్పితో విలవిలలాడింది. హుటాహుటిన బంధువులు ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న సెల్‌ఫోన్‌ను బయటకు తీశారు. దీంతో ఆ యువతి నొప్పి నుంచి ఉపశమనం పొందింది.
ఆమె వయసు 18 ఏళ్లు(18 year old girl). సెల్‌ఫోన్ విషయంలో తమ్ముడితో (younger brother) గొడవ పడింది. ఈ కొట్లాటలో ఆగ్రహానికి గురైన యువతి ఉన్నట్టుండి మొబైల్‌ను మింగేసింది. విషయం తెలుసుకున్న బంధువులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి గ్వాలియర్ జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ వైద్యుల బృందం సర్జరీ చేసి కడుపులో ఉన్న సెల్‌ఫోన్‌ను విజయవంతంగా బయటకు తీశారు.
మొబైల్ (mobile phone ) కడుపులో ఉండిపోవడంతో యువతి భరించలేని నొప్పితో వాంతులు చేసుకుంటూ ఆస్పత్రికి వచ్చిందని గ్వాలియర్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ ధాకడ్ తెలిపారు. అల్ట్రాసౌండ్, ఇతర పరీక్షలు చేశాక కడుపులో మొబైల్ ఉన్నట్టుగా గుర్తించామన్నారు. సర్జరీ డాక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం రెండు గంటల పాటు ఆపరేషన్ చేసి యువతి కడుపులో ఉన్న ఫోన్ బయటకు తీశారని వెల్లడించారు. యువతికి పది కుట్లు పడ్డాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నొప్పి నుంచి ఉపశమనం పొందినట్లుగా వెల్లడించారు.
గత ఫిబ్రవరిలో బీహార్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ పోలీసుల కంటపడకుండా ఉండేందుకు సెల్‌ఫోన్ మింగేశాడు. కొద్దిసేపటికే తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి ఎక్స్‌రే తీస్తే విషయం బయట పడింది. అలాగే గత వారం ఇండోర్‌లో కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. 11 నెలల చిన్నారి మినీ ఎల్‌ఈడీని మింగేసింది. శ్వాసనాళంలో ఇరుక్కుపోయిన ఎల్‌ఈడీని వైద్యులు సురక్షితంగా బయటకు తీశారు.
ఇది కూడా చదవండి: Restaurant Banned Smartphone: ఆ రెస్టారెంట్‌లో స్మార్ట్‌ఫోన్లు బ్యాన్.. తినాలంటే ఫోన్‌ను పక్కన పెట్టేయాల్సిందే.. ఈ వింత రూల్ వెనుక..!
ఇది కూడా చదవండి: Viral News: రైలు పట్టాల పక్కనే 70 ఏళ్ల బామ్మ.. చేతిలో ఎర్రటి వస్త్రం.. కంగారు పడుతూనే ట్రైన్ బ్రేకులు వేసిన లోకో పైలెట్.. వెళ్లి చూస్తే..
ఇది కూడా చదవండి: Wedding Gift: హోం థియేటర్ పేలి వరుడు చనిపోయిన కేసులో షాకింగ్ ట్విస్ట్.. పెళ్లిలో ఆ బహుమతిని ఎవరు ఇచ్చారా అని ఆరా తీస్తే..
ఇది కూడా చదవండి: Viral Video: అన్నీ రూ.500 నోట్ల కట్టలే.. దండగా కట్టుకుని మెడలో వేసుకుని.. విసిరేస్తున్నాడు.. ఎందుకిలా చేశాడంటే..!
ఇది కూడా చదవండి: Aadhaar Card New Rules: ఆధార్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై వీటిల్లో ఏ ఒక్కటి చేయాలన్నా..!
ఇది కూడా చదవండి: Blind Acting: అమ్మబాబోయ్.. స్టార్ హీరోయిన్లు కూడా ఈమె ముందు దిగదుడుపే.. ఏకంగా 15 ఏళ్ల పాటు అంధురాలిగా ఎందుకు నటించిందంటే..
ఇది కూడా చదవండి: Viral Video: ఈ అమ్మాయిలేంటి..? కాలేజీకి పప్పు కుక్కర్లు, చెత్త డబ్బాలు, బకెట్లను తీసుకొచ్చారేంటని అవాక్కవుతున్నారా..? అసలు కథేంటంటే.
Updated Date - 2023-04-06T15:47:21+05:30 IST