ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సగం కాలిన శవాన్ని ఇసుకలో పూడ్చి పెట్టారు.. నెల తర్వాత పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు.. అసలు కథేంటంటే..

ABN, First Publish Date - 2023-02-03T17:39:07+05:30

నెల రోజుల నుంచి ఆ వ్యక్తి కనిపించడం లేదు. ఏమయ్యాడో తెలియదు. బతికుంటే ఎక్కడున్నాడో సమాచారం లేదు. ఊళ్లోవాళ్లందరిలో ఒకటే ఆందోళన. డబ్బున్న వాడు కాదు.. ఉద్యోగస్తుడంతకన్న కాదు. ప్రతి నిత్యం కళ్ల ముందు కనిపించినోడు సడన్‌గా మాయమయ్యాడు. ఇంట్లో వాళ్లేమో సాఫీగా సాగిపోతున్నారు. ఎటొచ్చి ఊరోళ్లే గాబరా పడుతున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఏమయ్యాడు. పోలీసులకు ఈ వార్త ఎలా చేరింది. నెల తర్వాత బయటపెట్టిన ఆ నిప్పులాంటి నిజం ఏంటి? తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

ఆ నిప్పులాంటి నిజం ఏంటి? అసలు కథేంటంటే..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల రోజుల నుంచి ఆ వ్యక్తి కనిపించడం లేదు. ఏమయ్యాడో తెలియదు. బతికుంటే ఎక్కడున్నాడో సమాచారం లేదు. ఊళ్లోవాళ్లందరిలో ఒకటే ఆందోళన. డబ్బున్న వాడు కాదు.. ఉద్యోగస్తుడంతకన్న కాదు. ప్రతి నిత్యం కళ్ల ముందు కనిపించినోడు సడన్‌గా మాయమయ్యాడు. ఇంట్లో వాళ్లేమో సాఫీగా సాగిపోతున్నారు. ఎటొచ్చి ఊరోళ్లే గాబరా పడుతున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఏమయ్యాడు. పోలీసులకు ఈ వార్త ఎలా చేరింది. నెల తర్వాత బయటపెట్టిన ఆ నిప్పులాంటి నిజం ఏంటి? తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

సహజంగా ఏదైనా విలువైన వస్తువు పోగొట్టుకుంటే అది దొరికేంత వరకూ ఎంతో కష్టపడుతుంటాం. ఇళ్లంతా తెగ వెతుకుతాం. అణువణువూ పరిశీలించి అది దొరికేంత వరకూ జల్లెడ పడతాం. ఇది సహజంగా ప్రతి ఒక్కరూ చేసే పనే. అలాంటిది ఇంట్లో ఒక వ్యక్తి కనిపించకుండా పోయాడంటే ఇంకెంత కంగారుండాలి. కానీ అలాంటిదేమీ అక్కడ కనిపించలేదు. అదే ఆ ఊరోళ్లకు అనుమానం తెచ్చింది. కొంచెం కూడా అనుమానం రాకుండా నెట్టికొచ్చింది. చివరికి పోలీసులకు ఇలా అడ్డంగా బుక్కైపోయారు.

ఏపీ(AP)లోని ఏలూరు జిల్లా (Eluru District) ముసునూరు మండలం యల్లాపురానికి చెందిన కాశీ తన భార్యతో కాపురం ఉంటున్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన లోకేష్‌తో కాశీ భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఏకాంతంగా గడపడానికి తమ సుఖానికి అడ్డుగా ఉన్నాడని కాశీని అంతమొందించేందుకు కుట్రపన్నారు. అంతే తడువుగా కాశీతో లోకేష్ (Lokesh) స్నేహాన్ని పెంచుకున్నాడు. ఓ రోజున ఇసుక తోలాలంటూ చెక్కపల్లి అటవీ ప్రాంతానికి కాశీని తీసుకెళ్లాడు. పథకం ప్రకారం లోకేష్ తన స్నేహితులతో కలిసి కాశీపై పెప్పర్ స్ప్రే జల్లి.. అతనిపై ఇనుపరాడ్డుతో దాడి చేసి హతమార్చారు (dead body). అనంతరం మృతదేహంపై డీజిల్ (Diesel) పోసి తగలబెట్టారు. కానీ శవం పూర్తిగా కాలకపోవడంతో ఇసుకలోనే పాతి పెట్టేశారు. ఇలా నెల రోజులు గడిచిపోయింది. కానీ భార్యలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. కనీసం పోలీసులకు కూడా తెలియజేయలేదు. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన కాశీ తండ్రి.. కొద్ది రోజులుగా కొడుకు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఖాకీలు విచారణ వేగవంతం చేశారు.

ఇది కూడా చదవండి: దేవుడు చెప్పేశాడు.. నాకీ పెళ్లి వద్దు.. విడాకులు ఇప్పించండంటూ కోర్టు మెట్లెక్కిన ఓ భర్త.. చివరకు ఏం జరిగిందంటే..

పోలీసులు జల్లెడ పడుతున్నారన్న వార్త తెలిసిన నిందితుడు లోకేష్.. తమ బండారం ఎక్కడ బయటపడిపోతుందోనన్న భయంతో ఉన్నట్టుండి తహశీల్దార్ ఎదుట లొంగిపోయాడు. అనంతరం ఏం జరిగిందో తెలియజెప్పడంతో తమ్మిలేరు (sand)లో పూడ్చి పెట్టిన మృతదేహాన్ని పోలీసులు వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని వెలికితీసి ఆధారాల సేకరణకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు నూజివీడు డీఎస్పీ తెలిపారు. కాగా కాశీ హత్య ఘటనలో నిందితుల పేర్లను పోలీసులు పూర్తిగా వెల్లడించకపోవడంపై యల్లాపురం గ్రామస్థులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-02-03T17:39:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising