ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

VGold Facts: ఈ ప్రపంచంలో అసలు ఎన్ని టన్నుల బంగారముంది..? మొత్తం బంగారాన్ని ఒక్క చోట చేర్చి కరిగించి తీగలా మార్చితే..

ABN, First Publish Date - 2023-04-05T19:11:41+05:30

బంగారం అంటే ఇష్టం లేని వారు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. బంగారం విషయంలో రేటు దగ్గరి నుంచి ప్రతి వార్త.. జనాన్ని విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఏరోజుకారోజు దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు జనం ఆసక్తి కనబరుస్తుంటారు. ఒంటిపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బంగారం అంటే ఇష్టం లేని వారు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. బంగారం విషయంలో రేటు దగ్గరి నుంచి ప్రతి వార్త.. జనాన్ని విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఏరోజుకారోజు దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు జనం ఆసక్తి కనబరుస్తుంటారు. ఒంటిపై బంగారం వేసుకోవడం స్టేటస్ సింబల్‌గా భావిస్తున్న ప్రస్తుత తరుణంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రపంచంలో అసలు ఎన్ని టన్నుల బంగారం ఉంటుంది. ఒకవేళ మొత్తం బంగారాన్ని ఒక్క చోట చేర్చి కరిగించి తీగలా మార్చితే ఎంత పొడవు ఉంటుంది. ఇలాంటి పలు ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలసుకుందాం..

వజ్రాలకు (Diamonds) ఎంత విలువ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే అలాంటి వజ్రాల కంటే బంగారం (gold) దొరకడమే కష్టమట. అవును మీరు వింటుంది నిజమే.. మైనింగ్‌లో 5 క్యారెట్ల వజ్రం (5 carat diamond) చాలా సులభంగా దొరుకుతుంది. కానీ 28 గ్రాముల బంగారం దొరకడం చాలా కష్టం. అందుకే బంగారాన్ని సంపాదించడం వజ్రాల కంటే కష్టమని అంటూ ఉంటారు. అలాగే మరో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే.. ప్రపంచంలోని బంగారాన్ని మొత్తం ఒకే చోటకు తెస్తే.. దాన్ని 21 మీటర్ల క్యూబికల్ క్రేట్‌లో ఉంచవచ్చట. అదేవిధంగా ప్రపంచంలోని బంగారాన్ని మొత్తం కరిగించి, దాన్నుంచి 5మైక్రాన్ల మందపాటి తీగను తయారు చేస్తే.. దాంతో ప్రపంచాన్ని 11 మిలియన్ల కంటే ఎక్కువ సార్లు చుట్టవచ్చట. సాధారణంగా బంగారం 1,064 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద కరగడం ప్రారంభమవుతుంది.

Viral Video: క్లాస్‌రూమ్‌లో అంతా చూస్తుండగా లవ్ ప్రపోజ్.. ఆ యువతి రెస్పాన్స్ చూసి బిత్తరపోయిన కుర్రాడు.. మరుక్షణమే..!

అదేవిధంగా 2,808 డిగ్రీల వరకూ వేడి చేసినప్పుడు.. అది ఉడకడం ప్రారంభమవుతుంది. ప్రపంచంలో సగం బంగారం ఆభరణాల రూపంలో ఉండగా.. 20 శాతం నాణేలు ETFa రూపంలో ఉంది. అలాగే 17శాతం బంగారం కేంద్ర బ్యాంకుల వద్ద ఉంది. మరోవైపు 13శాతం బంగారం మైక్రోచిప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, ఔషధాల తయారీకి ఉపయోగించబడుతోంది. ఇప్పటి వరకు ప్రపంచంలో సుమారు 1,90,000 టన్నుల బంగారం వెలికితీయబడింది. బంగారాన్ని ధనవంతులు ఎక్కువగా వినియోగిస్తున్నా.. మొత్తం పరిమాణంలో చూసుకుంటే మధ్యతరగతి కుటుంబాల వారే ఎక్కువగా వినియోగిస్తున్నట్లు ఓ సర్వేలో బయటపడింది. రూ.20 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు 27 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేస్తే.. తక్కువ ఆదాయ వర్గం వారు 51.68 గ్రాములు, రూ.5 నుంచి రూ.20 లక్షల ఆదాయ బ్రాకెట్‌లోని వినియోగదారులు 25.13 గ్రాములు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడైంది.

Viral Videos: ఓరి నాయనో.. మెట్రో రైళ్లలో ఇన్ని కళాఖండాలా..? డ్రస్సుల నుంచి ముద్దు సీన్ల వరకు ఎన్ని నిర్వాకాలు జరిగాయో మీరే చూడండి..!

Updated Date - 2023-04-05T19:11:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising