ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మో మనం రోజూ తినే ఉప్పుతో ఇంత డేంజరా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ బయటపెట్టిన షాకింగ్ నిజం.. ఏకంగా ప్రాణాలే..

ABN, First Publish Date - 2023-03-15T11:36:29+05:30

ఉప్పులేని కూర.. సారం లేని జీవితం ఒకటేనని చెబుతారు కానీ.. దాంతోనే మనకు ముప్పు వచ్చి పడిందిప్పుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

'ఉప్పెక్కువ తినకండిరా బాబూ.. బీపి వస్తుంది' అని పెద్దలు పదే పదే చెబుతుంటారు. పెద్దలు కూడా దాన్ని ఫాలో కారనుకోండి అది వేరే విషయం. నోటికి తగినంత ఉప్పు లేకపోతే తినే ఆహారం మొత్తం రుచిలేనిదిగానే అనిపిస్తుంది. వెంటనే పక్కనే ఉన్న డబ్బా నుండి ఉప్పు తీసుకుని కాస్త అందులో కలుపుకుంటే తప్ప సాటిసిఫాక్షన్ ఉండదు చాలామందికి. కానీ ఇది చాలా పొరపాటు, మీరు రోజూ స్లో పాయిజన్ ను తీసుకుంటున్నారని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మనం రోజూ ఆహారంలో తీసుకునే ఉప్పు గురించి.. దాని మోతాదు, దాని ఫలితం, ఏ రకమైన ఉప్పు తీసుకుంటున్నాం? ఏది మంచిది? వంటి విషయాలను ప్రపంచ ఆరోగ్యసంస్థ చర్చిస్తుంది. ప్రతి సంవత్సరం మార్చి నెలలో 14 నుండి 20తేదీల మధ్య వారం రోజుల పాటూ అవగాహన చర్చలు చేస్తుంది. అందులో భాగంగా 70లక్షలమంది ఉప్పు కారణంగా మరణానికి చేరువలో ఉన్నారనే షాకింగ్ నిజాన్ని వెల్లడించింది. అందరినీ కలవర పెడుతున్న ఈ విషయం గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

ఉప్పులో సోడియం, పొటాషియం రెండూ ఉంటాయి. సోడియం మన శరీరంలో నీటిని అభివృద్ది చేయడం నుండి శరీరంలో అన్ని అవయవాలకు ఆక్సిజన్ ను, పోషకాలను సరఫరా చేయడంలో సహాయపడుతుంది. దీనివల్లే మన శరీరంలో కండరాలు, నరాలు శక్తివంతం అవుతాయి. కాబ్టటి ఉప్పు శరీరానికి అవసరమే. కానీ.. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే జుట్టు రాలిపోవడం, కిడ్నీలలో వాపు, శరీరానికి నీరు పట్టడం జరుగుతుంది. ఎముకలు బలహీనం అవుతాయి. గుండె జబ్బులు, పక్షవాతం, అధిక రక్తపోటు వంటి సమస్యలు కూడా చుట్టుముడతాయి. దీన్ని బట్టి చూస్తే ఉప్పు ఎక్కువ కాకుండా తక్కువా కాకుండా ఓ పరిధిలో తీసుకోవడం ఆరోగ్యమేనని అర్థమవుతుంది.

చాలామంది ఇసుకలా సన్నగా, జాలువారుతున్నట్టు ఉండే ఉప్పు వాడటానికే మొగ్గు చూపుతారు. అలాంటి ఉప్పు మంచిదని కూడా అనుకుంటారు. కానీ ఈ అభిప్రాయం శుద్ద తప్పనే విషయం ఇప్పుడు వెల్లడయింది. ఉప్పులో మూడు రకాలు ఉన్నాయి. సాధారణ ఉప్పు, నల్ల ఉప్పు, రాళ్ళ ఉప్పు గా చెప్పవచ్చు. వీటిలో సాధారణ ఉప్పు ఇసుకలా ఉంటుంది. కొన్ని కంపెనీలు ఇలాంటి ఇప్పులో మినరల్స్ జోడించామని చెబుతున్నా అదంతా కృత్రిమమే కాబట్టి కృత్రిమ మినరల్స్ మనకు ఎంత వరకు ప్రయోజనకరం అనే విషయాన్ని ఆలోచించుకోవాలి.

నల్ల ఉప్పు తయారు చేయడానికి మైరోబాలన్ విత్తనాలను ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఉడికిస్తారు. నీరు మొత్తం ఆవిరైపోయాక మిగిలేదే నల్లఉప్పు. ఇందులో 85శాతం సోడియం క్లోరైడ్, 15శాతం ఇనుము, రాగి, జింక్ వంటి మూలకాలు ఉంటాయి. దీన్ని తీసుకుంటే మలబద్దకం, కడుపునొప్పి, తల తిరగడం, వాంతులు వంటి సంస్యలు తగ్గుతాయి. కొన్ని రకాల ఆహారాల్లో దీన్ని కొద్ది మోతాదులో తీసుకోవచ్చు. కానీ.. గుండె, కిడ్నీ సమస్యలున్నవారు డాక్టర్ సలహా లేకుండా దీన్ని అసలు వాడకూడదు.

రాళ్ళ ఉప్పును కల్లు ఉప్పు అని కూడా పిలుస్తారు. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పరిమాణం సాధారణ ఉప్పులో కంటే ఎక్కువ ఉంటుంది. జీర్ణవ్యవస్థకు మంచిది. అయితే ధైరాయిడ్ సమస్య ఉన్న వారు ఎక్కువగా తింటే అయోడిన్ లోపం ఏర్పడుతుంది.

మరీ ముఖ్యంగా సాధారణ ఉప్పును ఎంత తగ్గిస్తే అంత ఆరోగ్యానికి మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న విషయం. ఇప్పటికే ఈ ఉప్పు వాడకం ఎక్కువయ్యి సుమారు 70లక్షల మంది ప్రాణాపాయంలో ఉన్నట్టు సర్వేలో వెల్లడయింది. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే శరీరానికి మత్తు ఆవరించినట్టు ఉంటుందని, అది శరీర కండర, నాడీ వ్వస్థకు ప్రమాదమని చెబుతున్నారు. మీకూ ఉప్పులేకుంటే కష్టం అనిపిస్తే.. భవిష్యత్తు కష్టాల గురించి కొంచెం ఆలోచించి తరువాత ఉప్పు డబ్బా టచ్ చెయ్యండి.

Read also: Solar AC: ఈ ఏసీని చూస్తే ఎగిరి గంతేస్తారు.. ఒక్కరూపాయి కరెంట్ బిల్లు రాదు.. కరెంట్ లేదనే బెంగ అక్కర్లేదు..


Updated Date - 2023-03-15T11:43:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising