ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూడ్సు వ్యాగన్లలో స్టీరింగ్‌లా కనిపించే ఆ పరికరం ఏమిటి? అది ఎందుకు ఉపయోగపడుతుందంటే..

ABN, First Publish Date - 2023-04-17T13:26:51+05:30

గూడ్స్ రైలులోని వ్యాగన్లకు స్టీరింగ్(Steering) లాంటి గుండ్రని చక్రం కనిపిస్తుంది. దీనిని చూడగానే ఇదేంటిది? ఇలా ఉందేంటి? దీని వలన ప్రయోజనం ఏమిటనే ప్రశ్న మన మదిలో మెదులుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడ్స్ రైలులోని వ్యాగన్లకు స్టీరింగ్(Steering) లాంటి గుండ్రని చక్రం కనిపిస్తుంది. దీనిని చూడగానే ఇదేంటిది? ఇలా ఉందేంటి? దీని వలన ప్రయోజనం ఏమిటనే ప్రశ్న మన మదిలో మెదులుతుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. గూడ్స్ రైలు కోచ్‌లకు బయట చిన్న స్టీరింగ్ లాంటి వీల్ కనిపిస్తుంది. ఇది నేలను తాకని రీతిలో ఉంటుంది. చాలా మంది దీనిని స్టెఫనీ అని అనుకుంటారు. అయితే అది స్టెఫనీ కాదు. గూడ్స్ రైలు(Goods train)లోని ప్రతి వ్యాగన్‌లోనూ ఈ పరికరం కనిపిస్తుంది.

నిజానికి మొదట్లో గూడ్స్ రైలు వ్యాగన్‌లలో ఇలాంటి ఫ్లైవీల్‌(Flywheel) ఉండేదికాదు. దీంతో నాటి రోజుల్లో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తేవి. అప్పట్లో గూడ్స్ రైలును ఏటవాలు లాంటి చోట ఆపితే ప్రమాదానికి ఆస్కారం ఉండేది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇంజనీర్లు(Engineers) గూడ్స్ రైలులోని ప్రతి బోగీలో ఫ్లైవీల్‌ను అమర్చారు. నిజానికి ఇది చక్రం కాదు, హ్యాండ్‌బ్రేక్(Handbrake) లాగా పనిచేసే లివర్. ఎప్పుడైనా గూడ్స్ రైలును ఆరోహణం లేదా వాలుపై ఆపవలసి వస్తే, ఈ చక్రం సవ్యదిశ(clockwise)లో తిరుగుతుంది. దీంతో బోగీ చక్రాలన్నీ జామ్ అయి గూడ్స్ రైలు సులువుగా దాని స్థానంలో నిలవగలుగుతుంది.

Updated Date - 2023-04-17T13:46:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising