Crime News: ఫోన్ అడిగిన పాపానికి భార్య చేసిన నిర్వాకం.. భర్త అని కూడా చూడకుండా.. కత్తెరతో..
ABN, Publish Date - Dec 28 , 2023 | 07:43 PM
దంపతుల మధ్య కొన్నిసార్లు పెద్ద గొడవలు తలెత్తినా.. కాసేపటికి సర్దుకుపోతుంటాయి. అయితే మరికొన్నిసార్లు మాత్రం చిన్న చిన్న కారణాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతుంటాయి. ఈ గొడవలు అప్పుడప్పుడూ దాడుల వరకూ పోతుంటాయి. ఈ క్రమంలో..
దంపతుల మధ్య కొన్నిసార్లు పెద్ద గొడవలు తలెత్తినా.. కాసేపటికి సర్దుకుపోతుంటాయి. అయితే మరికొన్నిసార్లు మాత్రం చిన్న చిన్న కారణాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతుంటాయి. ఈ గొడవలు అప్పుడప్పుడూ దాడుల వరకూ పోతుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. యూట్యూబ్ వీడియోలు చూసేందుకు ఫోన్ అడుగుతున్నాడని భర్తపై భార్య దాడి చేసింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బాగ్‌పత్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన అంకిత్, ప్రియాంక.. భార్యాభర్తలు. ఇటీవల వీరి కుటుంబంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ రోజు భార్య తన స్మార్ట్ ఫోన్‌లో (Smart phone) పాటలు వింటూ ఉంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన అంకిత్.. యూట్యూబ్ వీడియోలు (YouTube videos) చూసేందుకు ఫోన్ అడిగాడు. అయితే ఇందుకు ఆమె నిరాకరించింది. అయినా ఫోన్ ఇవ్వాల్సిందే అంటూ భర్త బలంతం చేశాడు. దీంతో ప్రియాంక మరింత ఆగ్రహంతో.. ఇచ్చేది లేదంటూ భీష్మించుకుంది.
Viral Video: అంతా ఇళ్లల్లో సామాన్లు తరిలిస్తే.. వీళ్లేమో ఏకంగా ఎంత పని చేశారో చూడండి..
ఈ విషయంలో దంపతుల మధ్య తలెత్తిన గొడవ కాస్త.. కాసేపటికి పెద్ద గొడవగా మారింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రియాంక.. పక్కనే ఉన్న కత్తెర తీసుకుని, భర్త కంటిపై పొడిచింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. చుట్టు పక్కల వారు అక్కడికి వచ్చి వారికి సర్దిచెప్పి, అంకిత్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. అంకిత్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భార్యపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Viral Video: పెళ్లి పీటలపైనే వరుడికి షాకిచ్చిన వధువు.. సరదాగా మొదలై చివరకు ఏమైందో చూడండి..
Updated Date - Dec 28 , 2023 | 07:43 PM