ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Wife: నా భార్య కంటే ఆమె అందంగా ఉందా..? అందాల పోటీల వేదికపైనే బీభత్సం సృష్టించిన భర్త..!

ABN, First Publish Date - 2023-05-31T14:16:51+05:30

పోటీలలో పాల్గొనే ప్రతి ఒక్కరూ గెలవాలనే తపనతోనే పాల్గొంటారు. కానీ ఒక్కరే విజేతగా నిలుస్తారు. ఓ మహిళ అందాల పోటీలో పాల్గొంది. అయితే దురదృష్టవశాత్తు ఆమె విజేత కాలేదు. దీంతో ఆమె భర్తకు కోపమొచ్చింది. 'విజేత అయిన మహిళ నా భార్యకంటే అందంగా ఉందా'అంటూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పట్లో ప్రతి విషయంలో పోటీ తత్వం ఉంది. పోటీ అన్నాక గెలుపోటములు సహజం. ఎంతమంది పోటీలో పాల్గొన్నా చివరకు విజేత స్థానంలో ఒక్కరే మిగులుతారు. ఓడిపోవడాన్ని స్పోర్టివ్ గా తీసుకునేవారు చాలా తక్కువ ఉంటారు. విజేతగా నిలిచిన వాడిలో నిజాయితీ లేదు, నాలోనే ఎక్కువ ట్యాలెంట్ ఉంది, కానీ నాకు అన్యాయం జరింగింది అని వాపోయేవారు ఎక్కువగా ఉంటారు. ఓ మహిళ అందాల పోటీలో పాల్గొంది. అయితే దురదృష్టవశాత్తు ఆమె విజేత కాలేదు. దీంతో ఆమె భర్తకు కోపమొచ్చింది. విజేత అయిన మహిళ నా భార్యకంటే అందంగా ఉందా అంటూ అతను చేసిన పని అందరినీ అవాక్కయ్యేలా చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పూర్తీ వివరాల్లోకి వెళితే..

అన్ని పోటీల లాగే అందాల పోటీలు(beauty contests) కూడా చాలా గ్రాండ్ గా జరుగుతాయి. విజేతగా నిలిచి తలమీద కిరీటంతో(crown) మహారాణిలా ఫీలైపోతారు మహిళలు. అయితే ఓడిపోయినవారిలో ఓటమిని ఒప్పుకునేవారు తక్కువ. కానీ ఇక్కడ మాత్రం ఓడిపోయిన మహిళ భర్త తన భార్య ఓటమిని ఒప్పుకోలేకపోయాడు. బ్రెజిల్(Brasil) దేశంలో LGBTQIAP+ వారి అందాల పోటీ నిర్వహించారు. ఈ పోటీలో పలువురు మహిళలు పాల్గొన్నారు. పాల్గొన్న అందరి నుండి ఇద్దరు మహిళలను ఫైనల్ కు ఎంపిక చేశారు. వారిద్దరిలో విజేత ఎవరనే ఉత్కంఠ కొంతసేపు సాగింది. ఆ తరువాత విజేత పేరు ప్రటించారు. విజేతగా నిలిచిన ఇమాన్యుయెలీ బెల్లి అనే మహిళను గౌరవిస్తూ ఆమె తలమీద కిరీటం పెట్టబోయారు. రన్నరప్(runner up women) గా నిలిచిన నథాలీ అనే మహిళ వేదిక మీదనే ఉంది. ఆమె భర్తకు ఈ తంతంగం నచ్చలేదు. విజేతగా నిలిచిన మహిళ తన భార్యకంటే అందంగా లేకపోవడం అతనికి చెప్పలేనంత కోపం తెప్పించింది. అతను కోపంతో ఊగిపోతూ వేదిక మీదకు వెళ్ళాడు. వేదికమీద విజేత తలమీద కిరీటాన్ని పెట్టేటప్పుడు సరిగ్గా దాన్ని లాగేసుకున్నాడు.(Man drag crown from winner). అనంతరం ఆ కిరీటాన్ని వేదికమీదనే నేలకేసి పదే పదే కొట్టాడు. అతన్ని నిలువరించడానికి పలువురు ప్రయత్నించినా అతను ఆపలేదు. దీంతో అతన్ని బలవంతంగా వేదిక మీద నుండి లాక్కెళ్ళాల్సివచ్చింది.

Hair: ఎందుకూ పనికిరావని దానిమ్మ తొక్కలను పారేస్తున్నారా..? వాటిని ఇలా కూడా వాడొచ్చండోయ్.. నల్లగా నిగనిగలాడే జుట్టు కావాలంటే..!


ఈ వీడియోను Bruno Guzzo అనే ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రన్నరప్ మహిళ భర్త చేసిన పనికి అవాక్కవుతున్నారు. 'ఆ వేదిక మీద అలాంటి భీభత్సం జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు' అని అంటున్నారు. 'అందని ద్రాక్ష పుల్లన అని అనుకోవాలి. కానీ ఇలా రచ్చ చేస్తారా?' అని మరికొందరు కామెంట్స్ చేశారు. 'అతను నిజమైన భర్త, తన భార్య అందం మీద అతనికెంత నమ్మకమో..' అని మరికొందరు అంటున్నారు.

Mahima Datla: ఎవరీ మహిమ దాట్ల..? హైదరాబాద్ కు చెందిన ఈమె ఆస్తి ఏకంగా రూ.8700 కోట్లు..!


Updated Date - 2023-05-31T14:16:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising