ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Wife: భార్య వాట్సప్ చాటింగ్‌ను ఫొటోలు తీసుకుని మరీ.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భర్త.. గుడికి వెళ్లి వస్తానని చెప్పి..!

ABN, First Publish Date - 2023-07-07T11:22:50+05:30

ఓ భర్త తన భార్య వాట్సప్ ఛాటింగ్ ను పోటోలు తీసుకుని మరీ పోలిస్ స్టేషన్ మెట్లెక్కాడు. నా భార్య ఇలా చేసింది చూడండంటూ పోలీసులముందు వాపోయాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భార్యాభర్తలు ఒకరిమీద మరొకరు ఆరోపణలు చేసుకుంటున్న కాలమిది. ఒకరు తెలివిగా తప్పు చేస్తే ఆ తప్పును మరొకరు అంతే తెలివిగా బయటపెడుతుంటారు. ఓ భర్త తన భార్య వాట్సప్ ఛాటింగ్ ను పోటోలు తీసుకుని మరీ పోలిస్ స్టేషన్ మెట్లెక్కాడు. నా భార్య ఇలా చేసింది చూడండంటూ పోలీసులముందు వాపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు, పోలీసుల స్పందన చాలా షాకింగ్ గా ఉన్నాయి. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

బీహార్(Bihar) రాష్ట్రం వైశాలి జిల్లా ఫతేపూర్ లో వింత సంఘటన చోటు చేసుకుంది. పటేపూర్ లో భాస్కర్ కుమార్(38) అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతని భార్య పేరు శ్యాంభరి(30). వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది. భాస్కర్ నివాసం ఫతేపూర్ అయినా అతను గోవాలో ఉద్యోగం(husband work in goa) చేస్తున్నాడు. దీంతో ఇతని భార్య శ్యాంభరి తన అత్తామామలతో కలిసి వైశాలిలో నివాసం ఉంటోంది. భర్త దూరంగా ఉండటంతో శ్యాంభరి సోషల్ మీడియాకు బానిసైంది(wife addicted to social media). ఈ క్రమంలోనే ఆమెకు ఫేస్ బుక్(face book) లో రితేష్ అనే 25ఏళ్ళ కుర్రాడితో రెండేళ్ళ కిందట పరిచయం ఏర్పడింది. రానురాను వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఎప్పుడూ ఫోన్ లో మాట్లాడుకుంటూ ఎడాపెడా ఛాటింగ్ చేసుకునేవారు. ఈ క్రమంలో శ్యాంభరి థానేశ్వర్ దేవాలయంలో జలపూజ చేసొస్తాను అని చెప్పి ఇంటి నుండి వెళ్ళింది. కానీ ఆమె తిరిగి రాలేదు.

Drinking Water: రోజూ పరగడపున నీళ్లు తాగితే మంచిదేనంటూ.. అందరూ చేస్తున్న బిగ్ మిస్టేక్ ఇదే.. ఆయుర్వేదంలో ఏముందంటే..!


భాస్కర్ కుమార్ తన భార్య ప్రవర్తనలో గత కొంతకాలంగా ఉన్న మార్పును పసిగట్టాడు. దీంతో అతను తన భార్యను గమనించేవాడు. ఆమె చూడనిసమయంలో రితేష్ తో ఆమె చేసిన ఛాట్ ను తన మొబైల్ లో ఫోటోలు తీసుకున్నాడు. దీని తరువాత అతను థానేశ్వ ర్ పోలిస్ స్టేషన్ కు వెళ్ళి 'నా భార్య గుడికి వెళ్లి తిరిగిరాలేదు, ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తే దీనికి కారణం' అంటూ పోలీసులకు ఛాటింగ్ ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాడు. తన భార్య ప్రేమించిన రితేష్ చివరి సారిగా తనకు థానేశ్వర్ ఆలయంలో కనిపించాడని అతను చెప్పాడు. నా భార్యను ఎలాగైనా వెతికిపెట్టండని పోలీసుల ముందు వాపోయాడు. అయితే పోలీసులు ఇతనికి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఈ కేసు ఫతేపూర్ పోలిస్ స్టేషన్ పరిధికి చెందుతుంది మీరు అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయండి అని పోలీసులు చెప్పారు. దీంతో భాస్కర్ కుమార్ ఫతేపూర్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానని తెలిపాడు. ఈ సంఘటన గురించి ఇతర వివరాలు ఇంకేమీ తెలియలేదు.

Updated Date - 2023-07-07T11:32:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising