Divorce Case: విడాకులు కావాలంటూ పెళ్లయిన 2 నెలలకే కేసు పెట్టిన భార్య.. అసలేం జరిగిందని భర్తను అడిగితే..!
ABN, First Publish Date - 2023-11-24T20:20:26+05:30
ఆ యువతికి బ్లైండ్ డేట్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు.. కొద్ది నెలల సహజీవనం తర్వాత 60 రోజుల క్రితం ఇరువురూ వివాహం చేసుకున్నారు.. అప్పటికే ఆమె గర్భవతి.. వివాహం జరిగిన రెండు నెలల తర్వాత ఆమెకు అబార్షన్ జరిగింది.. దీంతో ఆమె భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకుని కోర్టును ఆశ్రయించింది..
ఆ యువతికి బ్లైండ్ డేట్ (Blind Date) ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు.. కొద్ది నెలల సహజీవనం తర్వాత 60 రోజుల క్రితం ఇరువురూ వివాహం చేసుకున్నారు.. అప్పటికే ఆమె గర్భవతి (Pregnancy).. వివాహం జరిగిన రెండు నెలల తర్వాత ఆమెకు అబార్షన్ (Abortion) జరిగింది.. దీంతో ఆమె భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకుని కోర్టును ఆశ్రయించింది.. తనకు భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కోరింది.. ఆమెకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేసిన భర్త షాకింగ్ విషయం బయటపెట్టాడు. చైనా (China)లో ఈ ఘటన జరిగింది.
సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన షువాంగ్ అనే యువతికి బ్లైండ్ డేట్ ద్వారా జియోయా అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కొద్ది నెలల సహజీవనం ఫలితంగా షువాంగ్ గర్భం దాల్చింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన రెండు నెలలకే షువాంగ్‌కు అబార్షన్ అయింది. అబార్షన్ చేయించుకున్న అనంతరం షువాంగ్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. భర్త విడాకులు ఇచ్చేందుకు అంగీకరించాడు. అయితే పెళ్లికి ముందు తాను ఇచ్చిన రూ.21 లక్షల బహుమతిని తిరిగి ఇచ్చెయ్యాలని పిటిషన్ వేశాడు.
Money: ఒకే ఒక్క అబద్ధాన్ని నిజం అని నమ్మిందో 40 ఏళ్ల మహిళ.. దెబ్బకు రూ.1.59 కోట్లు మటాష్..!
అంతేకాదు షువాంగ్ గురించి ఓ షాకింగ్ విషయం కూడా బయటపెట్టాడు. షువాంగ్‌కు తన కంటే ముందు ఆరుగురు పురుషులతో వివాహాలు జరిగాయని బాంబు పేల్చాడు. అందరి నుంచి భారీ బహుమతులు తీసుకుని, వారిని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుందని చెప్పాడు. ఇరువురు వాదనలు విన్న కోర్టు జియోయాకు షువాంగ్ 11 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వాలని తీర్పునిచ్చింది.
Updated Date - 2023-11-24T20:20:27+05:30 IST