ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lift: లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన 32 ఏళ్ల మహిళ.. మూడు రోజుల తర్వాత ఓపెన్ చేసి చూస్తే.. ఆమె ఎంత నరకం అనుభవించిందంటే..!

ABN, First Publish Date - 2023-08-01T19:02:11+05:30

ప్రస్తుతం అపార్ట్‌మెంట్ కల్చర్ బాగా పెరిగిపోయింది. చిన్న పట్టణాలలో కూడా భారీ భవంతులు, వాటిలో లిఫ్ట్‌లు దర్శనమిస్తున్నాయి. లిఫ్ట్‌ల వల్ల ఎంత ఉపయోగం ఉందో, అప్పుడప్పుడు అంతే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. లిఫ్ట్ గోడల మధ్య ఇరుక్కుపోయి వ్యక్తులు చనిపోయిన ఘటనలు ఎన్నో విన్నాం.

ప్రస్తుతం అపార్ట్‌మెంట్ కల్చర్ బాగా పెరిగిపోయింది. చిన్న పట్టణాలలో కూడా భారీ భవంతులు, వాటిలో లిఫ్ట్‌లు (Lifts) దర్శనమిస్తున్నాయి. లిఫ్ట్‌ల వల్ల ఎంత ఉపయోగం ఉందో, అప్పుడప్పుడు అంతే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. లిఫ్ట్ గోడల మధ్య ఇరుక్కుపోయి వ్యక్తులు చనిపోయిన ఘటనలు ఎన్నో విన్నాం. తాజాగా ఓ మహిళ మూడు రోజుల పాటు లిఫ్ట్‌ (Elevator)లో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఉజ్బెకిస్థాన్‌ (Uzbekistan)లోని తాష్కెంట్‌లో జరిగింది. మరణించడానికి ముందు ఆమె ఎంతో నరకం అనుభవించిందో పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్ ద్వారా బయటపడింది.

తాష్కెంట్‌ (Tashkent)లో పోస్ట్ ఉమన్‌గా పని చేస్తున్న ఓల్గా లియోన్‌టేవా అనే మహిళ తన విధుల్లో భాగంగా ఓ తొమ్మిది అంతస్థుల భవనంలోకి వెళ్లింది. లిఫ్ట్ ఎక్కి చివరి అంతస్థు‌కు చేరుకోవాలనుకుంది. లిఫ్ట్ 8వ అంతస్థు దాటగానే ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో ఓల్గా ఎవరైనా వచ్చి సహాయం చేస్తారేమో అని ఎదురు చూసింది. ఎంతసేపటికీ ఎవరూ రాకపోవడంతో భయంతో కేకలు వేసింది. ఆమె అరుపులు ఎవరికీ వినిపించలేదు. చివరకు లిఫ్ట్‌లో ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో ఆమె ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరై చీకట్లోనే ప్రాణాలు కోల్పోయింది (Woman Dies In Elevator).

Viral Video: ఇదెక్కడి పైత్యం భయ్యా.. పెట్రోల్‌తో బైక్ వాష్.. రీల్స్ కోసం మరీ ఇంత రిస్క్ అవసరమా?

ఓల్గా కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మూడ్రోజుల అన్వేషణ అనంతరం లిఫ్ట్‌లో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. భయాందోళన, ఊపిరి ఆడకపోవడం వల్లే ఓల్గా చనిపోయినట్టు పోస్ట్‌మార్టంలో తేలింది. అయితే ఆ భవనంలోని లిఫ్ట్‌ను మూడు రోజులు ఎందుకు వాడకుండా ఉన్నారు? ఈ ఘటన కేవలం ప్రమాదమేనా? లేక ఇంకేవైనా కారణాలు ఉన్నాయా? అని పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు (Crime News).

Updated Date - 2023-08-01T19:02:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising