ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking: 10 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యక్తి.. ఆస్పత్రి ఆవరణలో భార్యకు ఎలా కనిపించాడంటే.. వైరల్ అవుతున్న కన్నీటి కథ!

ABN, First Publish Date - 2023-07-29T21:06:15+05:30

ఉత్తరప్రదేశ్‌లోని బలియా ప్రభుత్వాసుపత్రిలో జరిగిన ఓ ఘటన చాలా మంది హృదయాలను కదిలిస్తోంది. పదేళ్ల క్రితం అదృశ్యమైన భర్త ఆస్పత్రి వెలుపల బిచ్చగాడిగా ప్రత్యక్షం కావడంతో ఆ మహిళ నివ్వెరపోయింది. మానసికంగా కుంగిపోయి పిచ్చివాడిలా మారిపోయిన భర్తను గుర్తు పట్టి మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నించింది.

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని బలియా ప్రభుత్వాసుపత్రిలో జరిగిన ఓ ఘటన చాలా మంది హృదయాలను కదిలిస్తోంది. పదేళ్ల క్రితం అదృశ్యమైన భర్త (Husband) ఆస్పత్రి వెలుపల బిచ్చగాడి (Beggar)గా ప్రత్యక్షం కావడంతో ఆ మహిళ నివ్వెరపోయింది. మానసికంగా కుంగిపోయి పిచ్చివాడిలా మారిపోయిన భర్తను గుర్తు పట్టి మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నించింది. అతడికి స్నానం చేయించి, తల దువ్వింది. ఆ ఘటన చాలా మందిని కదిలిస్తోంది (Viral News).

బలియాకు చెందిన ఓ మహిళ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. ఆస్పత్రి బయట ఆమెకు మాసిన గడ్డంతో ఉన్న ఓ బిచ్చగాడు కనిపించాడు. ఆ వ్యక్తిని పరిశీలనగా చూసిన మహిళ అతడిని పదేళ్ల క్రితం మాయమైన తన భర్తగా గుర్తించింది. దు:ఖం తన్నుకురావడంతో అతడిని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ``ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లిపోయారు? ఇలా ఎందుకు అయిపోయారు?`` అంటూ ప్రశ్నించింది.

Viral Video: ఏం ట్యాలెంట్ బాసూ.. బైక్ ఇంజిన్, స్క్రాప్‌తో నాలుగు చక్రాల బండి.. కుర్రాళ్లపై నెటిజన్ల ప్రశంసలు!

ఆ వ్యక్తి మాత్రం ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. ఆ మహిళ వైపు కన్నార్పకుండా చూస్తుండిపోయాడు. ఆ తర్వాత ఆ మహిళ తన ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే బట్టలు తీసుకురమ్మని చెప్పిది. బైక్ మీద వచ్చిన ఓ యువకుడు ఆ మహిళను, ఆమె భర్తను తీసుకెళ్లిపోయాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2023-07-29T21:32:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising