ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వైరల్‌గా మారిన షాకింగ్ వీడియో.. ఓ యువతిని ఎత్తుకుని మరీ అగ్ని ప్రదక్షిణలు.. ఆమె ఏడుస్తూ వద్దని వేడుకుంటున్నా..!

ABN, First Publish Date - 2023-06-07T19:53:47+05:30

రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో జరిగిన సంచలన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్నే షేక్ చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజస్థాన్‌ (Rajasthan)లోని జైసల్మేర్ జిల్లాలో జరిగిన సంచలన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ (Viral Video)గా మారింది. ఈ వీడియో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్నే షేక్ చేస్తోంది. ఆ వీడియోలోని యువతికి న్యాయం జరగాలని, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్ (DCW)చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ డిమాండ్ చేస్తున్నారు. జైసల్మేర్‌ (Jaisalmer) జిల్లాలోని సంఖ్లా గ్రామానికి చెందిన యువతిని ఈ నెల 1న కొందరు యువకులు కిడ్నాప్ చేశారు.

ఆమెను ఎత్తుకెళ్లిన వాళ్లలో ఓ దుండగుడు ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. వైరల్‌ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి యువతిని తన చేతులతో ఎత్తుకుని గడ్డితో వేసిన మంట చుట్టూ తిరుగుతున్నాడు. ఆ మంట చుట్టూ ఏడు సార్లు తిరిగి సప్తపది అయిపోయిందని చెబుతున్నాడు. మనకి పెళ్లి అయిపోయిందని, మరొకర్ని పెళ్లి చేసుకోవద్దని ఆ యువతిని బెదిరించాడు. ఆ ఘటన జరుగుతున్న సమయంలో ఆ యువతి కేకలు పెట్టింది. తనను కాపాడాలని వేడుకుంది. తనను కాపాడమంటూ యువతి కేకలు వేయడం వీడియోలో వినిపిస్తోంది (Woman forcibly married by kidnapper).

Bail after Death: చనిపోయిన రెండ్రోజుల తర్వాత బెయిల్ ఇచ్చిన కోర్టు.. ఆరోగ్యం బాగాలేదంటూ ఓ ఖైదీ బెయిల్‌కు దరఖాస్తు చేసుకుంటే..!

తమ కూతురు కనిపించడం లేదని ఆ యువతి తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు సకాలంలో స్పందించలేదు. ఈ ఘటన జరిగి ఏడు రోజులు గడిచినా యువతిని కిడ్నాప్ చేసిన వారిని పోలీసులు పట్టుకోలేకపోయారు. తన కూతురికి న్యాయం చేయకుంటే ఆత్మాహుతి చేసుకుంటానని యువతి తండ్రి పోలీసులను హెచ్చరించాడు. ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని స్వాతి మలివాల్ రాజస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు.

Updated Date - 2023-06-07T19:53:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising