Woman Health: అమ్మాయిలూ.. చిన్న కడుపునొప్పి వచ్చినా డాక్టర్‌ను కలవండంటూ.. ఈ 25 ఏళ్ల యువతి ఎందుకు చెప్తోందంటే..!
ABN, First Publish Date - 2023-09-06T14:56:45+05:30
అమ్మాయిలకు కడుపు నొప్పి(stomach pain in women's) చాలా సాధారణమైన విషయం. కొందరు కడుపునొప్పికి పెయిన్ కిల్లర్లు వాడితే మరికొందరు అదే తగ్గుతుందిలే అని లైట్ తీసుకుంటారు. ఈమె అలాగే చేసింది కానీ..
కడుపునొప్పి, తలనొప్పి, ఒళ్లునొప్పులు, జలుబు, దగ్గు వంటి సాధారణ సమస్యలను చాలామంది తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. ఇక వయసులో ఉన్న అమ్మాయిలు అయితే నెలసరి సమస్యల కారణంగా కడుపునొప్పి చాలా సహజం అని అనుకుంటుంటారు. కానీ 'కడుపునొప్పి చిన్నది అయినా సరే నిర్లక్ష్యం చేయకండి, వైద్యులను కలవడానికి మీకోసం మీరు కాస్త సమయాన్ని కేటాయించుకోండి' అని చెబుతోంది ఓ పాతికేళ్ళ యువతి. ఆమె అందరికీ ఇంత జాగ్రత్త చెప్పడం వెనుక గల కారణం ఏంటి? ఈమె ఎవరు? పూర్తీగా తెలుసుకుంటే..
అమ్మాయిలకు కడుపు నొప్పి(stomach pain in women's) చాలా సాధారణమైన విషయం. కొందరు కడుపునొప్పికి పెయిన్ కిల్లర్లు వాడితే మరికొందరు అదే తగ్గుతుందిలే అని లైట్ తీసుకుంటారు. ఆస్ట్రేలియా(Australia) దేశం మెల్బోర్న్ సిటిలో నివసించే క్లో స్పిట్లాటిక్ అనే యువతి కూడా అలానే అనుకుంది. ఆమెకు తరచుగా కడుపునొప్పి వచ్చేది. అవన్నీ సాధారణం అనే ఆలోచనతో వాటిని ఆమె సీరియస్ గా తీసుకోలేదు. 2020లో కోవిడ్ ఉధృత రూపం దాల్చిన సమయంలో ఆమెకు కడుపు నొప్పి తీవ్రత పెరిగింది. కడుపులో అండాశయాలు ఉండే ప్రాంతంలో నొప్పి పదేపదే వచ్చేది. కడుపులో ఏదో గుచ్చుకుంటున్నట్టు అనిపించేది. దీంతో ఆమె తన తల్లితో ఫోన్లో విషయం చెప్పింది. కూతురుకు దూరంగా ఉన్న ఆమె తల్లి వైద్యుడిని కలవమని సలహా ఇచ్చింది. స్పిట్లానిక్ వైద్యుడిని కలిసిన తరువాత భయంకర నిజం తెలిసింది. ఆమెకు అండాశయ క్యాన్సర్(ovarian cancer) ఉందని, అది కూడా మూడవ స్టేజ్ లో ఉందని తెలిసింది. 22ఏళ్ళకే అండాశయ క్యాన్సర్ ఏమిటంటూ ఆమె షాక్ కు లోనైంది. తన సమస్యను అంగీకరించడానికి ఆమెకు చాలా సమయం పట్టిందట.
Viral Video: పాపం.. ఈ పిల్లాడు ఎంత ఫీలయ్యాడో.. టీచర్స్ డే కదా అని మస్తు సెలబ్రేషన్స్ చేస్తోంటే.. తరగతి గదిలోనే..!
కరోనా కారణంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు అందరూ దూరంగానే ఉన్నారని, ఎవరితోనూ నిజం చెప్పుకోలేక చాలా నరకం అనుభవించానని ఆమె చెప్పుకొచ్చింది. తన సమస్య పరిష్కారానికి శస్త్రచికిత్సను ఆశ్రయించింది. శస్త్రచికిత్స తరువాత ఆమె ఫిజియోథెరపీ సహాయంతోనే లేవడం, కూర్చోవడం, నిలబడం, నడవడం మొదలైనవి అలవాటు చేసుకోవాల్సి వచ్చిందట. ప్రస్తుతం ఆమె వయసు 25సంవత్సరాలు. ఈ సమస్య నుండి ఆమె పూర్తీగా కోలుకోవడానికి తిరిగి పూర్తీ ఫిట్ గా మారడానికి మూడేళ్ల సమయం తీసుకుందట. ఇవన్నీ గుర్తుచేసుకుంటూ 'మహిళలు ఏ చిన్న కడుపునొప్పి వచ్చినా దయచేసి డాక్టర్లను కలవండి' అంటూ అందరినీ అభ్యర్థిస్తోంది.
Hyderabad vs Bangalore: బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చేశా.. ప్రతి నెలా రూ.40 వేలు సేఫ్.. నెట్టింట రచ్చ లేపిన ఓ టెకీ పోస్ట్..!
Updated Date - 2023-09-06T15:26:22+05:30 IST