ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Wife: పిల్లలతో కలిసి నిద్రపోతున్న భర్త.. తలగడ తీసుకొచ్చిన తల్లి, ఫ్రెండ్.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-10-09T14:51:36+05:30

ఆ వ్యక్తి లండన్‌ (London)లో నివసించే ఎన్నారై.. కుటుంబంతో కలిసి భారత్‌లోని తన స్వరాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)కు వచ్చాడు.. కొద్దిరోజుల పాటు యూపీలోని బంధు, మిత్రుల ఇళ్లకు తిరుగుతూ సంతోషంగా గడిపాడు.. ఆ తర్వాత హఠాత్తుగా నిద్రలోనే మరణించాడు..

ఆ వ్యక్తి లండన్‌ (London)లో నివసించే ఎన్నారై.. కుటుంబంతో కలిసి భారత్‌లోని తన స్వరాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)కు వచ్చాడు.. కొద్దిరోజుల పాటు యూపీలోని బంధు, మిత్రుల ఇళ్లకు తిరుగుతూ సంతోషంగా గడిపాడు.. ఆ తర్వాత హఠాత్తుగా నిద్రలోనే మరణించాడు.. ఎవరో అతడికి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారని పోస్ట్‌మార్టమ్‌లో తేలింది.. తల్లే తన తండ్రిని చంపడం కళ్లారా చూశానని కొడుకు చెబుతున్నాడు (Wife killed husband). ఆస్థి కోసం తల్లిదండ్రులే తన భర్తను చంపేశారని భార్య చెబుతోంది. ఈ కేసును విచారించిన యూపీ కోర్టు హతుడి భార్యకు ఉరిశిక్ష విధించింది (Crime News).

యూపీకి చెందిన సుఖ్‌జీత్ సింగ్ (34) తన భార్య రమణదీప్ కౌర్‌, పిల్లలతో కలిసి లండన్‌లో నివసిస్తున్నాడు. ఆగస్టు 2016లో షాజహాన్‌పూర్‌లోని అతని స్వస్థలానికి కుటుంబంతో సహా చేరుకున్నాడు. సెప్టెంబర్ 2, 2016న ఇంట్లో సుఖ్‌జీత్ హత్యకు గురయ్యాడు. కుమారులు అర్జున్, ఆర్యన్‌లతో కలిసి నిద్రిస్తున్న సమయంలో సుఖ్‌జీత్ హత్యకు గురయ్యాడు. తన పక్కన నిద్రిస్తున్న తండ్రి తలపై తల్లి దిండుతో అదిమి ఊపిరి ఆడకుండా చేసిందని, అదే సమయంలో తల్లి స్నేహితుడు గురుప్రీత్ కత్తితో నాన్న గొంతు కోశాడని ప్రత్యక్ష సాక్షి, హతుడి కొడుకు అర్జున్ కోర్టులో సాక్ష్యం చెప్పాడు.

Viral Video: ఆ మహిళ ట్యాలెంట్‌కు ఫిదా కావాల్సిందే.. ఇంట్లోని పాత్రలతో డ్రమ్స్ సెట్ చేసి ఎలా వాయిస్తోందో చూడండి..

ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన జిల్లా కోర్టు తాజాగా తుదితీర్పు వెలువరించింది. రమణ్‌దీప్ కౌర్‌కు మరణ శిక్ష (Death Penalty) విధించింది. అలాగే హత్యకు సహకరించిన గురుప్రీత్‌కు జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పుపై పై కోర్టును ఆశ్రయిస్తానని రమణదీప్ పేర్కొంది. భారత్‌లో ఉన్న ఆస్థులన్నింటినీ అమ్మేసి లండన్‌లో స్థిరపడిపోవాలని సుఖ్‌జీత్ భావించాడని, ఆస్థులు పోతాయనే భయంతోనే అతడి తల్లిదండ్రులు, సోదరులు ఈ హత్యకు పాల్పడ్డారని, తనను తెలివిగా ఇరికించారని తెలిపింది.

Updated Date - 2023-10-09T14:51:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising