ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Panipuri: పానీ పూరీ తింటూ నవ్వడమే ఆ యువతి చేసిన తప్పయింది.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు కలిసి చంపేశారు..!

ABN, First Publish Date - 2023-11-28T19:43:27+05:30

ముంబైలో ఓ ఘోరమైన ఘటన వెలుగు చూసింది. పానీపూరీ తింటూ నవ్వుతున్న యువతిని ముగ్గురు అక్కాచెల్లెళ్లు చితక్కొట్టారు. తీవ్ర గాయాల పాలైన ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ముంబైలోని కల్వాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

ముంబైలో (Mumbai) ఓ ఘోరమైన ఘటన వెలుగు చూసింది. పానీపూరీ (Pani Puri) తింటూ నవ్వుతున్న యువతిని ముగ్గురు అక్కాచెల్లెళ్లు చితక్కొట్టారు. తీవ్ర గాయాల పాలైన ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ముంబైలోని కల్వాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు (Crime News).

ముంబైలోని జై భీమ్ నగర్‌కు చెందిన రేణుక అనే యువతికి నాలుగేళ్ల క్రితం రాహుల్‌తో వివాహం జరిగింది. రాహుల్ రెండేళ్ల క్రితం చనిపోయాడు. ఆ తర్వాత అదే బస్తీకి చెందిన మరో యువకుడిని రేణుక పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి రాహుల్ కుటుంబంతో రేణుకకు సంబంధాలు తెగిపోయాయి. మాజీ భర్త రాహుల్ సోదరి ముక్తతో రేణుకు శత్రుత్వం ఏర్పడింది. ఈ నెల 23వ తేదీన ముక్త తన స్నేహితురాలితో కలిసి ఓ పానీపూరీ స్టాల్ దగ్గర పానీపూరీ తింటోంది. తన స్నేహితరాలితో కలిసి నవ్వుకుంటూ ముక్త పానీపూరీ తింటుండగా రేణుక అటువైపు వెళ్లింది. ముక్త తనను చూసి ఎగతాళిగా నవ్వుతోందని రేణుక భావించింది.

Viral News: లిఫ్ట్‌ను వాడితే రూ.1000 జరిమానా.. పనిమనుషులు, డెలివరీ బాయ్స్‌కు హౌసింగ్ సొసైటీ వింత కండీషన్..!

ముక్త దగ్గరకు వెళ్లి నిలదీసింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరుసటి రోజు ఉదయం ముక్త పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లగా, రేణుక తన అక్కచెల్లెళ్లు అంజనా, లక్ష్మిలతో కలిసి అక్కడికి చేరుకుంది. ముగ్గురూ కలిసి ముక్తను కొట్టడం ప్రారంభించారు. ముక్త తలను నేలకు వేసి కొట్టారు. తీవ్రంగా గాయపడిన ముక్తను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ముక్త మరణించింది. హత్య కేసు నేరం కింద అక్కాచెల్లెళ్లు ముగ్గురినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - 2023-11-28T19:43:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising