Viral Video: ఇదెక్కడి ప్రయోగంరా బాబూ.. బిస్కెట్లతో పకోడీనా.. వైరల్ వీడియోపై నెటిజన్ల స్పందన ఏంటంటే..
ABN, First Publish Date - 2023-11-05T17:11:55+05:30
పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటారు. ఆహార ప్రియులు రకరకాల ఆహార పదార్థాలను టేస్ట్ చేసేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి వారు కోసం కొందరు విభిన్న ప్రయోగాలు చేస్తుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అలాంటి కొత్త రకం వంటకాలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వస్తున్నాయి.
పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటారు. ఆహార ప్రియులు రకరకాల ఆహార పదార్థాలను టేస్ట్ చేసేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి వారు కోసం కొందరు విభిన్న ప్రయోగాలు (Food Experiments) చేస్తుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అలాంటి కొత్త రకం వంటకాలకు సంబంధించిన వీడియోలు (Food Videos)ఎక్కువగా వస్తున్నాయి. ఐస్‌క్రీమ్ సమోసా, ఫిష్ టీ వంటి వినూత్న ప్రయోగాలు మన కళ్ల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం బిస్కెట్ పకోడీలకు (Biscuit Pakodas) సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
@Shayarcasm అనే ట్విటర్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో (Viral Video) ఓ మహిళ తన ఇంట్లో పొయ్యి ముందు కూర్చుని బిస్కెట్ పకోడీలు తయారు చేస్తోంది. బిస్కెట్లను పండిలో ముంచి వాటిని నూనెలో వేయిస్తోంది. ముందుగా ఆమె బంగాళాదుంపలతో కూర చేసింది. ఆ తర్వాత ఆ కూరను రెండు బిస్కెట్ల మధ్య ఉంచి, ఆ బిస్కెట్లను పిండిలో ముంచి నూనెలో వేయించింది. ఆ తర్వాత వాటిని ప్లేట్లో పెట్టి సాస్‌తో కలిపి ఇస్తోంది (Food and Health).
Viral Video: రైలులో మ్యూజిక్కు అనుగుణంగా యువతి డ్యాన్స్.. ఆ సమయంలో ఓ యువకుడు వచ్చి ఏం చేశాడో చూడండి..
పకోడీలను ఇలా తయారు చేయడం చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 30 వేల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``ఇలాంటి పకోడీలు ఎవరు తింటారో``, ``ఇది బెంగాల్ వంటకం అనుకుంటా``, ``నాకు తెలిసి అవి ఎవరూ తినరు.. అది వీడియో కోసమే అనుకుంటా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
Updated Date - 2023-11-05T17:11:57+05:30 IST