ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Wife: ఓ పక్క తండ్రి.. మరోపక్క తల్లి.. మధ్యలో ఉన్నది కన్న కూతురే.. ఏం చేసి మరీ ఇలా పోలీసులకు దొరికిపోయారో తెలిస్తే..!

ABN, First Publish Date - 2023-09-27T16:52:15+05:30

ఆ యువతి సామాన్యమైనది కాదు.. చూడడానికి అమాయాకంగా కనిపించే ఆ యువతి నిర్వాకాల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఆ యువతి ఇప్పటికి మూడు సార్లు వివాహాలు చేసుకుంది.. మొదటి ఇద్దరికీ విడాకులు ఇచ్చింది.. ఆ తర్వాత మూడో వ్యక్తిని వివాహం చేసుకుని కాపురం చేసింది..

ఆ యువతి సామాన్యమైనది కాదు.. చూడడానికి అమాయాకంగా కనిపించే ఆ యువతి నిర్వాకాల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఆ యువతి ఇప్పటికి మూడు సార్లు వివాహాలు చేసుకుంది.. మొదటి ఇద్దరికీ విడాకులు ఇచ్చింది.. ఆ తర్వాత మూడో వ్యక్తిని వివాహం చేసుకుని కాపురం చేసింది.. కొన్ని రోజుల క్రితం అతడు మరణించాడు.. ప్రస్తుతం నాలుగో పెళ్లికి సిద్ధమవుతోంది.. అసలు ట్విస్ట్ ఏంటంటే.. నాలుగో వివాహం కోసం మూడో భర్తను తల్లిదండ్రులతో కలిసి ఆమే హత్య చేసిందని పోలీసులు కనిపెట్టారు (Wife killed husband).. ముగ్గురినీ అరెస్ట్ చేశారు (Crime News).

బీహార్ (Bihar) రాజధాని పాట్నా సమీపంలోని ఫుల్వారీ షరీఫ్‌లో కొద్ది రోజుల క్రితం జరిగిన సుభాష్ ప్రజాపతి అనే యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్య అస్మారీ ఖాటూన్ చేతిలోనే అతడు హతమైనట్టు పోలీసులు గుర్తించారు. అస్మారీ గురించి పోలీసులు ఆరా తీయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అస్మారీ అప్పటికే ఇద్దరిని వివాహాలు చేసుకుని వారికి విడాకులు ఇచ్చింది. ఆ వివాహాల వల్ల ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించి సుభాష్‌ను మాయ చేసి వివాహం చేసుకుంది. అతడి ఆస్తి కాజేయాలని ప్రయత్నించింది.

Woman: కాబోయే భర్తను కలిసేందుకు బయటకు వెళ్లడమే ఆ యువతి చేసిన పొరపాటయింది.. అతడిని కలిసి మాట్లాడుతుండగానే..!

ఆస్తి విషయమై భర్తతో తరచుగా గొడవ పడేది. ఆస్తి విషయంలో రాజీకి రాకపోవడంతో సుభాష్‌ను హత్య చేయాలని పథకం వేసింది. తల్లిదండ్రులతో కలిసి భర్త గొంతు కోసి చంపేసింది. అనంతరం అతడి మృతదేహాన్ని గ్రామం అవతల పొదల్లో పడేసింది. సుభాష్ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అస్మారీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అస్మారీ నిజం అంగీకరించింది. తన తల్లిదండ్రుల సహకారంతో తానే భర్తను చంపినట్టు అంగీకరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ముగ్గురినీ అరెస్ట్ చేశారు.

Updated Date - 2023-09-27T16:52:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising