ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Woman: ఎంత పని చేశావమ్మా..? ఐ డ్రాప్స్‌కు బదులుగా పొరపాటున నెయిల్ గ్లూ‌ను కళ్లల్లో వేసుకుందో మహిళ.. చివరకు..!

ABN, First Publish Date - 2023-10-04T15:54:10+05:30

ఒక్కోసారి తెలిసో తెలియకో చేసిన పొరపాటు జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్పుతుంది. కొద్ది రోజుల క్రితం అమెరికాకు చెందిన ఓ మహిళ తెలియక చేసిన చిన్న పొరపాటు ఆమెకు ఎంతో బాధను మిగిల్చింది. ఆమె కంటి నొప్పి వచ్చినపుడు ఐ డ్రాప్స్‌కు బదులుగా నెయిల్ గ్లూ కంట్లో వేసుకుంది.

ఒక్కోసారి తెలిసో తెలియకో చేసిన పొరపాటు (Mistake) జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్పుతుంది. కొద్ది రోజుల క్రితం అమెరికాకు (America) చెందిన ఓ మహిళ తెలియక చేసిన చిన్న పొరపాటు ఆమెకు ఎంతో బాధను మిగిల్చింది. ఆమె కంటి నొప్పి వచ్చినపుడు ఐ డ్రాప్స్‌ (Eye Drops)కు బదులుగా నెయిల్ గ్లూ (Nail Glue) కంట్లో వేసుకుంది. ఆ తర్వాత ఆమె అనుభవించిన నరకం మాటల్లో చెప్పలేం. ఆ మహిళ తన బాధను వివరిస్తూ ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది.

కాలిఫోర్నియా (California)లోని శాంటా రోసాలో నివసిస్తున్న జెన్నిఫర్ ఎవర్సోల్ అనే మహిళ కళ్లు (Eyes) బిగుసుకుపోవడంతో గత వారం హాస్పిటల్‌కు వెళ్లింది. ఆమె పరిస్థితి చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. వైద్యులు వెంటనే ఎవర్సోల్ కళ్లు తెరవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. మందులు ప్రయోగించారు. కానీ అవేవీ పనిచేయలేదు. చివరికి డాక్టర్లు ఆమె కనురెప్పలు కొయ్యాల్సి వచ్చింది. కంటి నొప్పి వచ్చినపుడు జెన్నిఫర్ ఐ డ్రాప్స్ అనుకుని నెయిల్ పాలిష్ వేసుకోవడానికి ముందు వేసుకునే జిగురును కంట్లో వేసుకుంది. దాంతో ఆమె కనురెప్పలు అతుక్కుపోయాయి.

Viral Video: ప్లేట్‌లో 135 ఎర్రెర్రటి మిరపకాయలు.. ఈ వ్యక్తి ఎన్ని నిమిషాల్లో వాటన్నిటినీ ఎలా తినేశాడో చూస్తే..!

వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి చూసి డాక్టర్లు కూడా చలించిపోయారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె కంటి రెప్పలు విడలేదు. దీంతో ఆమె కంటి రెప్పలను కొసెయ్యాల్సి వచ్చింది. తను చేసిన పొరపాటు ఇంకెవ్వరూ చేయొద్దని పేర్కొంటూ జెన్నిఫర్ ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను ఇప్పటివరకు 2.3 లక్షల మందికి పైగా వీక్షించారు.

Updated Date - 2023-10-04T15:54:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising