ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Amazon: రూ.50 వేల ఖరీదైన యాపిల్‌ వాచ్‌ను అమెజాన్‌లో ఆర్డర్ ఇస్తే.. ఈ మహిళకు ఏం డెలివరీ చేశారో చూస్తే..!

ABN, First Publish Date - 2023-07-12T18:28:03+05:30

ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ చాలా జోరుగా సాగుతుంది. ఇంట్లో కూర్చుని తమకు నచ్చిన వస్తువులను రప్పించుకునేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు చాలా నమ్మకంగా వినియోగదారులు ఆర్డర్ చేసిన వస్తువులనే డెలివరీ చేస్తాయి. అయితే అప్పుడప్పుడు వాటి ద్వారా కూడా నకిలీ వస్తువులు వస్తుంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ (Online Shopping) చాలా జోరుగా సాగుతుంది. ఇంట్లో కూర్చుని తమకు నచ్చిన వస్తువులను రప్పించుకునేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. అమేజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు చాలా నమ్మకంగా వినియోగదారులు ఆర్డర్ చేసిన వస్తువులనే డెలివరీ చేస్తాయి. అయితే అప్పుడప్పుడు అలాంటి బడా ఈ-కామర్స్ సైట్ల ద్వారా ఆర్డర్ చేసిన వస్తువుల్లో కూడా నకిలీవి వచ్చి వినియోగదారులకు షాకిస్తాయి. తాజాగా ఓ మహిళకు అలాంటి అనుభవమే ఎదురైంది.

సనయ అనే మహిళ అమేజాన్ ద్వారా ఆపిల్ వాచ్ (Apple Watch) సిరీస్ 8 ని రూ.50,900 లకి ఆర్డర్ చేసింది. నాలుగు రోజుల తర్వాత ఆమె ఇంటికి పార్సిల్ వచ్చింది. అయితే అందులో ఆపిల్ వాచ్‌కి బదులుగా ``ఫిట్ లైఫ్`` (Fit Life) వాచ్ ఉంది. షాకైన సనయ వెంటనే అమేజాన్ కస్టమర్ సెంటర్‌కు ఫోన్ చేసింది. అయితే అమేజాన్ ప్రతినిధులు ఆ పార్శిల్‌ను వెనక్కి తీసుకోవడం లేదా మార్చడం కుదరదని చెప్పారు. దీంతో సనయ తను ఆర్డర్ చేసిన ఆపిల్ వాచ్ డీటెయిల్స్‌తో పాటు తనకు వచ్చిన ఫేక్ వాచ్ ఫోటోలను ట్విటర్‌లో షేర్ చేసింది.

Viral Video: నెటిజన్లను కట్టిపడేస్తున్న వీడియో.. దాహంతో ఓ కుక్క పిల్ల అల్లాడిపోతోంటే ఈ పిల్లాడు ఏం చేశాడో మీరే చూడండి..!

``అమేజాన్ నుంచి ఎప్పుడూ ఆర్డర్ చేయకండి. నేను 8వ తేదీన ఆపిల్ 8 సిరీస్ వాచ్ ఆర్డర్ చేశాను. 9వ తేదీన నాకు నకిలీ ``ఫిట్ లైఫ్`` వాచ్ వచ్చింది. అమేజాన్ నా సమస్యను పరిష్కరించలేదు`` అంటూ ఆమె ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌పై స్పందించిన అమేజన్ హెల్ప్ సనయకు క్షమాపణలు చెప్పింది. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. సనయ ట్వీట్‌పై చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. ఖరీదైన గాడ్జెట్స్‌ను నేరుగా షాప్‌నకు వెళ్లి కొనుగోలు చేయడమే మంచిదని అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2023-07-12T18:28:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising