Viral Video: ఆమె ట్యాలెంట్ అద్భుతం.. చీర కట్టుకుని ఎలాంటి స్టంట్స్ చేసిందో చూడండి..
ABN, First Publish Date - 2023-07-01T11:54:22+05:30
కొంత మంది మహిళలకు చీర అనేది పండగల్లోనూ, ఫంక్షన్లలోనూ సాంప్రదాయబద్ధంగా ధరించే వస్త్రం. సామాన్య గృహిణులు ఇళ్లలో ఉన్నప్పుడూ చీరలు కట్టుకుంటారు. అయితే చీర కట్టుకున్నప్పుడు పద్ధతిగా ఉండాలని, ఎగరడం, దూకడం, స్టంట్స్ చేయడం వంటి పనులు చేయకూడదని అంటుంటారు.
కొంత మంది మహిళలకు చీర (Saree) అనేది పండగల్లోనూ, ఫంక్షన్లలోనూ సాంప్రదాయబద్ధంగా ధరించే వస్త్రం. సామాన్య గృహిణులు ఇళ్లలో ఉన్నప్పుడూ చీరలు కట్టుకుంటారు. అయితే చీర కట్టుకున్నప్పుడు పద్ధతిగా ఉండాలని, ఎగరడం, దూకడం, స్టంట్స్ చేయడం వంటి పనులు చేయకూడదని అంటుంటారు. అలాంటి వాటికి చీర సరైన కాస్ట్యూమ్ కాదని అంటారు. అయితే ఇటీవల కొందరు మహిళలు చీరలు కట్టుకుని అద్భుతమైన స్టంట్లు చేస్తున్నారు (Woman performs stunts in a saree).
ప్రముఖ కొరియోగ్రాఫర్ రుక్మిణీ విజయకుమార్ (Rukmini Vijayakumar) తాజాగా చీర కట్టుకుని అద్భుత విన్యాసాలు చేసింది. చీర కట్టుకుని చాలా సౌకర్యవంతంగా స్టంట్లు చేసింది. చీర కట్టుకుని బ్యాక్ ఫ్లిప్‌లు (Back flips), జిమ్నాసిక్ట్స్ చేసింది. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. శాస్త్రీయ, భరతనాట్యం నిపుణురాలైన రుక్మిణి చేసిన తాజా విన్యాసాలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.
Viral: అత్తగారి ప్రవర్తనతో వరుడు షాక్.. కొద్ది నిమిషాల్లో పెళ్లనగా క్యాన్సిల్.. అసలు ఏం జరిగిందంటే...
రుక్మిణీ విజయ్ కుమార్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె షేర్ చేసిన వీడియోను ఇప్పటివరకు 2.7 లక్షల మంది లైక్ చేశారు. ``అందమైన మీరు, అందమైన పరిసరాలు, అద్భుతమైన ట్యాలెంట్.. వావ్``, ``మేడమ్ శివతాండవం మీద వీడియో చేసి రిలీజ్ చేయండి.. ప్లీజ్`` అని కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఎంతో మంది ``వావ్``, ``అద్భుతం`` అంటూ ప్రశంసలతో, ఎమోజీలతో స్పందిస్తున్నారు.
Updated Date - 2023-07-01T11:54:22+05:30 IST