ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral News: ఇదో సీతారామం కథ.. 54 ఏళ్ల తర్వాత సరైన చిరునామాకు చేరిన పోస్ట్ కార్డు.. అందులో ఏముందంటే..

ABN, First Publish Date - 2023-07-22T20:33:07+05:30

మీరు ``సీతారామం`` సినిమా చూశారా? ఆ సినిమా మొత్తం ఓ పోస్ట్ కార్డు చుట్టూ తిరుగుతుంది. ఎన్నో ట్విస్ట్‌ల తర్వాత ఆ పోస్ట్ కార్డు చేరాల్సిన వారికి చేరుతుంది. సినిమాలో లాగ ప్రేమ కథ కాదు కానీ, తన క్షేమాన్ని తెలియజేస్తూ ఓ వ్యక్తి తన కుటుంబానికి పంపిన పోస్ట్ కార్డు 54 ఏళ్ల ఆలస్యంగా చేరుకుంది.

మీరు ``సీతారామం`` సినిమా చూశారా? ఆ సినిమా మొత్తం ఓ పోస్ట్ కార్డు (Post Card) చుట్టూ తిరుగుతుంది. ఎన్నో ట్విస్ట్‌ల తర్వాత ఆ పోస్ట్ కార్డు చేరాల్సిన వారికి చేరుతుంది. సినిమాలో లాగ ప్రేమ కథ కాదు కానీ, తన క్షేమాన్ని తెలియజేస్తూ ఓ వ్యక్తి తన కుటుంబానికి పంపిన పోస్ట్ కార్డు 54 ఏళ్ల ఆలస్యంగా చేరుకుంది. అప్పటికి ఆ పోస్ట్ కార్డు పంపిన వ్యక్తి, అందుకోవాల్సిన వారు చనిపోవడం విషాదం. తాజాగా ఫ్లోరిడాలో జెస్సికా మీన్స్ అనే మహిళ ఆ కార్డు అందుకుంది. ఆ కార్డు గురించి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్ వైరల్ అవుతోంది (Woman Receives 54 Years Old post card).

అమెరికా (America)లోని ఫ్లోరిడాకు చెందిన జెస్సికా చిరునామాకు గత సోమవారం ఒక పోస్ట్ కార్డు వచ్చింది. ఆ ఉత్తరం 1969వ సంవత్సరంలో పారిస్‌ (Paris)లోని ఈఫిల్ టవర్ నుంచి రాసినట్టు తెలుసుకుని జెస్సికా షాక్ అయింది. అడ్రస్ చూస్తే కరెక్ట్‌గా ఉంది. ఆ ఉత్తరం తన ఇంటి పాత యజమాని మిసెస్ రెనే ఎ. గగ్నన్‌కు వచ్చినట్టు తెలుసుకుంది. ఆ ఉత్తరం రాసిన వ్యక్తి చనిపోయి 30 సంవత్సరాలకు పైనే అవుతోంది. ఆ పోస్ట్ కార్డులో రాసి ఉన్న విషయాన్ని కూడా జెస్సికా వెల్లడించింది.

Govt Or Private Job: ప్రభుత్వ ఉద్యోగమా..? ప్రైవేటు జాబా..? ఏది బెస్ట్ అని ఈ యువతి వేసిన ఒక్క ప్రశ్నతో..

``మీకు ఈ కార్డు చేరే సమయానికి మేం ఇంటికి వచ్చేస్తామేమో. అయినా మా క్షేమ సమచారాన్ని మీకు తెలపడం కోసం ఈ ఉత్తరం రాస్తున్నాం. మేం ప్రస్తుతం ఈఫిల్ టవర్ (Eiffel Tower) దగ్గర ఉన్నాం. పారిస్‌లోని టూరిస్ట్ ప్రదేశాలను చూస్తూ చాలా ఆస్వాదిస్తున్నాం. ఇంకా కొన్ని చూడాల్సి ఉంద``ని ఆ ఉత్తరంలో ఉంది. జెస్సికా పోస్ట్ చేసిన ఈ పోస్ట్‌కార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ కార్డు ప్రయాణం కథ చాలా బాగుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-22T20:33:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising