ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: యూకేలో షాకింగ్ ఘటన.. కూతురి పెంపుడు ఎలుకను చంపి తిన్న తల్లి.. నెటిజన్లు ఫైర్.. కోర్టు తీర్పు ఏంటంటే..!

ABN, First Publish Date - 2023-03-10T12:48:23+05:30

యునైటెడ్ కింగ్‌డమ్‌లో (United Kingdom) షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

లండన్: యునైటెడ్ కింగ్‌డమ్‌లో (United Kingdom) షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఓ ఎలుకను (Pet Hamster) ఆమె తల్లి అత్యంత దారుణంగా చంపేసి, ఆపై కాల్చుకుని తినేసింది. అనంతరం దాని తాలూకు వీడియో, ఫొటోలను ఆమె సామాజిక మాధ్యమాల్లో (Social Media) పెట్టింది. వాటిని చూసిన నెటిజన్లు సదరు మహిళపై మండిపడ్డారు. ఈ విషయం కాస్త పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఆమెను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. దాంతో కోర్టు ఆమెను దోషిగా తేల్చి శిక్షను ఖరారు చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యూకేకు చెందిన ఎమ్మా పార్కర్ (39) అనే మహిళ తన కూతురు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఓ చిట్టెలుకను చంపి తింటూ, దాని తాలూకు వీడియో, ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టింది. అవి కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై ఫైర్ అయ్యారు. అదే సమయంలో వీడియో, ఫొటోలు పోలీసుల దృష్టికి కూడా వెళ్లాయి. దాంతో పోలీసులు ఎమ్మా పార్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసుల విచారణలో ఆమె.. ఆ చిట్టెలుకను తాను చంపలేదని, ఇంట్లోని పెంపుడు కుక్కల దాడిలో అది గాయపడి చనిపోయినట్లు తెలిపింది.

ఇది కూడా చదవండి: అతడికి 13.. ఆమెకు 31.. శారీరక సంబంధంతో గర్భం.. కోర్టు షాకింగ్ తీర్పు!

అలా చనిపోయిన తర్వాత దాన్ని తాను కాల్చుకుని తిన్నట్లు చెప్పింది. కాగా, ఎమ్మా పార్కర్ గత కొంతకాలంగా డ్రగ్స్‌కు బానిసైనట్లు, ఆ మత్తులోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందని ఆ తర్వాత పోలీసులకు తెలిసింది. తాజాగా ఆమెను న్యాయస్థానంలో హాజరుపరిచారు. దాంతో కోర్టు ఎమ్మా పార్కర్‌ను దోషి తేల్చి, 12 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

ఇది కూడా చదవండి: వలస వెళ్లారా..? లేక అందరినీ చంపేశారా..? రాత్రికి రాత్రే ఊళ్లో జనాలంతా మాయం.. వందల ఏళ్లయినా వీడని మిస్టరీ..!

Updated Date - 2023-03-10T12:48:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising