ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indian Railway: రైల్వే స్టేషన్‌లో పట్టాలపై ఈ యువతి పెర్ఫార్మెన్స్‌కు.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన పోలీసులు..!

ABN, First Publish Date - 2023-07-25T18:16:15+05:30

ప్రస్తుత డిజిటల్ యుగంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి ఎంతోగానో వెంపర్లాడుతున్నారు. అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. వెరైటీగా ఆలోచించి చుట్టుపక్కల వారికి షాకిస్తున్నారు.

ప్రస్తుత డిజిటల్ యుగంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ సోషల్ మీడియా (Social Media)లోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ (Instagram reels) చేయడానికి ఎంతోగానో వెంపర్లాడుతున్నారు. అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. వెరైటీగా ఆలోచించి చుట్టుపక్కల వారికి షాకిస్తున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఆ వీడియోలో ఓ యువతి రైల్వే పట్టాల (Railway track)పై డ్రామా పండించింది. చివరకు పోలీసులు ఆమెకు సరైన గిఫ్ట్ ఇచ్చారు.

ఆగ్రా రైల్వే స్టేషన్‌లో (Agra Railway Station) రైలు పట్టాలపై ఒక మహిళ డ్యాన్స్ వేస్తూ యాక్టింగ్ చేస్తోంది. ఓ విషాద పాటకు తనదైన శైలిలో పెర్ఫార్మెన్స్ ఇస్తోంది. ఆమె కుమార్తె వీడియో తీస్తోంది. ఆ వీడియోను సదరు మహిళ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. రైల్వే పట్టాలపై న్యూసెన్స్ క్రియేట్ చేసిన ఆమెపై చాలా మంది విమర్శలు గుప్పించారు. ఆ వీడియో రైల్వే పోలీసుల (RPF) వరకు చేరడంతో వారు స్పందించారు. ఆ వీడియోలోని మహిళను గుర్తించి ఆమెను, ఆమె కూతురిని అరెస్ట్ చేశారు.

Viral: బాస్ కొంపముంచిన కొలీగ్ మెసేజ్.. నేను గర్భవతినంటూ ఓ ఉద్యోగి నుంచి భర్తకు వచ్చిన వాట్సప్ మెసేజ్‌ను ఆ భార్య చదివి..

ఇకపై ఇలాంటి తప్పు చేయబోమని తల్లీకూతుళ్లు పోలీసులకు భరోసా ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులు వారికి బెయిల్ మంజూరు చేశారు. ఇంతకు ముందు కూడా రైళ్లపై, రైల్వే ట్రాక్‌లపై చాలా మంది వీడియోలు చేశారు. ఆ క్రమంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. రైల్వే చట్టం 145 మరియు 147 ప్రకారం ఇలా చేయడం నేరం. అలాంటి వారికి శిక్ష తప్పనిసరి అని పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-07-25T18:16:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising