ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: పార్కులో ఒంటరిగా యువతి.. ఎలుగుబంటి ఏం చేసిందో మీరే చూడండి.. ఆమె సీక్రెట్‌గా తీసిన వీడియోతో..!

ABN, First Publish Date - 2023-11-28T18:05:41+05:30

సింహాలు, పులులు, ఎలుగుబంట్లు వంటి క్రూర జంతువులను జూలో చూడడానికే భయం వేస్తుంటుంది. అవి బంధించి ఉన్నాయని తెలిసినా వాటిని చూసి ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది వాటిని నేరుగా చూస్తే.. అవి మనపై దాడి చేయడానికి వస్తుంటే.. ఎలా ఉంటుంది.

సింహాలు, పులులు, ఎలుగుబంట్లు వంటి క్రూర జంతువులను (Wild Animals) జూలో చూడడానికే భయం వేస్తుంటుంది. అవి బంధించి ఉన్నాయని తెలిసినా వాటిని చూసి ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది వాటిని నేరుగా చూస్తే.. అవి మనపై దాడి చేయడానికి వస్తుంటే.. ఎలా ఉంటుంది. కాలీఫోర్నియాలోని (California) ఓ మహిళకు అలాంటి అనుభవమే ఎదురైంది. వాకింగ్‌కు వెళ్లిన ఆ మహిళకు భయంకర అనుభవం ఎదురైంది. ఆ మహిళ సీక్రెట్‌గా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో వైరల్ (Viral Video) అవుతోంది.

కాలీఫోర్నియాకు చెందిన లారా గౌల్డ్ అనే మహిళ సియెర్రా మాడ్రేలోని మౌంట్ విల్సన్ పార్క్‌కు వాకింగ్ కోసం వెళ్లింది. ఆ సమయంలో ఓ ఎలుగు బంటి (Bear) తన రెండు పిల్లలతో కలిసి నడుస్తూ లారాకు కనిపించింది. లారా ఆ ఎలుగుబంట్లను వీడియో తీసింది. ఆ సమయంలో లారాను ఆ ఎలుగుబంటి చూసింది. తీవ్ర ఆగ్రహంతో లారా వైపు దూసుకొచ్చింది (Bear Attack). షాకైన లారా భయంతో కేకలు వేసింది. లారా ఆ ఎలుగుకు కనిపించకుండా తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. ఆ వీడియో మొత్తాన్ని లారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Success Story: ఒకప్పుడు రోడ్ల పక్కన పుస్తకాలు అమ్మాడు.. ఇప్పుడు ఏకంగా రూ.20 వేల కోట్ల ఆస్తి..!

ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోకు లక్షకు పైగానే వ్యూస్ వచ్చాయి. రెండు వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ భయంకర వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``చాలా భయంకర అనుభవం``, ``ఎలుగును చూసినపుడు కదలకుండా ఉండాలనే నియమాన్ని అందరూ మర్చిపోతారు``, ``మీరు ఎలా తప్పించుకున్నారనే ఆశ్చర్యం ఇంకా నన్ను వెంటాడుతోంది``, ``మీరు చాలా లక్కీ`` అని నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-11-28T18:05:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising