ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Wife: పెళ్లయ్యాక మొదటిసారి పుట్టింటికెళ్లిన భార్య.. అదే రోజు భర్త ఆత్మహత్య.. అసలు కారణమేంటో తెలిసి..!

ABN, First Publish Date - 2023-08-01T15:55:21+05:30

వివాహం తర్వాత మొదటిసారి కొత్త పెళ్లి కూతురు తన పుట్టింటికి వెళ్లినప్పుడు, ఆ ఇంట్లో సంతోషం నెలకొంటుంది. తల్లిదండ్రులు, తోబుట్టువులతో ఆమె సరదాగా గడుపుతుంది. అయితే ఉత్తరప్రదేశ్‌లోని బండాలో ఒక ఆశ్చర్యకర ఉదంతం వెలుగులోకి వచ్చింది.

వివాహం (Marriage) తర్వాత మొదటిసారి కొత్త పెళ్లి కూతురు (Newly wed bride) తన పుట్టింటికి వెళ్లినప్పుడు, ఆ ఇంట్లో సంతోషం నెలకొంటుంది. తల్లిదండ్రులు, తోబుట్టువులతో ఆమె సరదాగా గడుపుతుంది. అయితే ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని బండాలో ఒక ఆశ్చర్యకర ఉదంతం వెలుగులోకి వచ్చింది. పెళ్లి తర్వాత మొదటిసారిగా ఒక వధువు తన పుట్టింటికి (Maternal home) వెళ్లినప్పుడు, ఆమె అత్తమామల ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆయన ఆత్మహత్యకు గల కారణం బయటకు రావడంతో అందరూ షాక్‌కు గురయ్యారు (Crime News).

బండా జిల్లాలో కొత్వాలి ప్రాంతానికి నరేంద్ర అనే వ్యక్తికి చిత్రకూట్ జిల్లాకు చెందిన అమ్మాయితో రెండున్నర నెలల క్రితం వివాహం జరిగింది. వివాహం తర్వాత నూతన వధువు తన అత్తమామల ఇంట్లో భర్తతో కలిసి నివసిస్తోంది. అయితే నరేంద్ర మద్యానికి (Alchoholic) బానిస అనే విషయం తెలుసుకుని అతడి భార్య షాక్‌కు గురైంది. ఉద్యోగం రాకపోవడంతో డిప్రెషన్‌కు గురైన నరేంద్ర రోజూ మద్యం స్వీకరించేవాడు. తాగిన మత్తులో ఇంటికి వెళ్లేవాడు. భర్త చేత మద్యం మాన్పించడానికి ఆమె ఎంతగానో ప్రయత్నించింది. దాంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. డబ్బుల కోసం భార్య నగలను అమ్ముకునేవాడు. ఎదురు తిరిగితే భార్యపై నరేంద్ర ప్రతిరోజూ చేయి చేసుకునేవాడు.

Anti-Aging: అసలు సీక్రెట్‌ను బయటపెట్టిన బడా వ్యాపారవేత్త.. 45 ఏళ్ల నుంచి 37 ఏళ్లకు వయసును ఎలా తగ్గించాడంటే..!

ఇటీవల ఒకరోజూ ఇద్దరూ కలిసి గుడికి వెళ్లారు. అక్కడ కూడా మద్యం టాపిక్ వచ్చింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నరేంద్ర గుడిలో అందరి ముందు భార్యను కొట్టాడు. దీంతో ఆగ్రహించిన నరేంద్ర భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. నరేంద్ర ఆమెను తిరిగి రమ్మని చాలా సార్లు బతిమలాడాడు. అయినా అతడి భార్య తిరిగి రావడానికి ఇష్టపడలేదు. దీంతో ఆగ్రహం చెందిన నరేంద్ర ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Updated Date - 2023-08-01T15:55:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising