Vrial News: కుర్రాళ్లంతా క్యూలో వెళ్తోంటే.. అమ్మాయిలు కర్రలతో కొడతారట.. వయసు మీద పడుతున్నా పెళ్లిళ్లు కానీ కుర్రాళ్ల కోసం వింత ఆచారం..!

ABN, First Publish Date - 2023-04-10T15:24:27+05:30

నేటి టెక్నాలజీ యుగంలో ఎంతో మంది పాత పద్ధతులకు స్వస్తి చెప్పి.. ట్రెండ్‌కు తగ్గట్టుగా తమని తాము మార్చుకుంటుంటారు. ఇలాంటి ఆధునిక సమాజంలోనూ చాలా ప్రాంతాల్లో పాత సాంప్రదాయాలను పాటిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో పాటించే వందల ఏళ్ల నాటి ఆచారాలు, సాంప్రదాయాలను చూస్తే ..

Vrial News: కుర్రాళ్లంతా క్యూలో వెళ్తోంటే.. అమ్మాయిలు కర్రలతో కొడతారట.. వయసు మీద పడుతున్నా పెళ్లిళ్లు కానీ కుర్రాళ్ల కోసం వింత ఆచారం..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నేటి టెక్నాలజీ యుగంలో ఎంతో మంది పాత పద్ధతులకు స్వస్తి చెప్పి.. ట్రెండ్‌కు తగ్గట్టుగా తమని తాము మార్చుకుంటుంటారు. ఇలాంటి ఆధునిక సమాజంలోనూ చాలా ప్రాంతాల్లో పాత సాంప్రదాయాలను పాటిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో పాటించే వందల ఏళ్ల నాటి ఆచారాలు, సాంప్రదాయాలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇదేంటీ! మరీ విచిత్రంగా ఉందే.. అని అనిపిస్తుంటుంది. రాజస్థాన్‌లో జోధ్‌పూర్ జిల్లాలో ఓ విచిత్రమైన సాంప్రదాయం ఉంది. అమ్మాయిలు కొడితే అబ్బాయిలకు పెళ్లిళ్లు అవుతాయట. కుర్రాళ్లంతా క్యూలో వెళ్తోంటే.. అమ్మాయిలు కర్రలతో కొడుతూ ఉంటారు. వయసు మీద పడుతున్నా పెళ్లిళ్లు కానీ కుర్రాళ్ల కోసం వింత ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్‌లో జోధ్‌పూర్ జిల్లాలోని (Rajasthan Jodhpur district) పాత నగరంలో ఈ సాంప్రదాయాన్ని ఆచరిస్తున్నారు. దింగ గవర్ జాతరను (Dhinga Gavar festival) పురస్కరించుకుని స్థానికంగా ఉన్న గన్వర్ మాతకు మహిళలు పూజలు (Women worship) నిర్వహిస్తారు. పెళ్లయిన, పెళ్లి నిశ్చయమైన యువతులు ఈ పూజల్లో పాల్గొంటారు. సుమారు 16 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. చాలా మంది మహిళలు ఈ సమయంలో ఉపవాసం ఉంటారు. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో శుక్ల పక్షం మూడో రోజున ఈ జాతరను నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమం పాల్గొనేందుకు మగవారికి అనుమతి ఉండదు.

Priyanka Chopra: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా మగాడిలా మారితే.. ఇదిగో అచ్చం ఇలా ఉంటాడట.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..!

marriage-viral-news.jpg

అయితే కార్యక్రమం చివరి రోజు రాత్రి కొంత సమయం మగవారికి అనుమతి ఉంటుంది. ఇందుకు ఓ కారణం ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహాలు కాని యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. యువకులంతా క్యూలో వెళ్తూ ఉండగా.. మహిళలు, యువతులు అక్కడికి వచ్చి వారిని బెత్తంతో కొడుతూ ఉంటారు. ఇలా వారి చేత దెబ్బలు తింటే పెళ్లిళ్లు అవుతాయని వీరి నమ్మకం. దీంతో ఈ సమయంలో పెద్ద ఎత్తున యువకులు ఇక్కడికి తరలి వస్తుంటారు. ఏప్రిల్ 9న ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 16 రోజుల పూజల అనంతరం.. చివరి రోజున హారతి కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్భంగా చాలా మంది మహిళలు వివిధ రకాల వేషధారణలో ప్రదర్శన నిర్వహిస్తారు.

Viral Video: పోట్లాడుకుంటూ.. అంతా చూస్తుండగా.. ఆటోలోకి దూరిన ఎద్దు.. చివరికి ఏం జరిగిందో చూడండి..

మహిళలు మారువేషాలు వేసుకుని రోడ్డుపైకి వచ్చినప్పుడు.. తమకు ఎదురుగా వచ్చిన మగవాడిని కర్రతో (Women beat men with sticks) కొడతారు. ఈ సాంప్రదాయం 1459వ సంవత్సరం నుంచి కొనసాగుతోందని నిర్వాహకులు తెలిపారు. ఈ జాతర ప్రాశస్త్యం గురించి వారు వివరిస్తూ.. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తల్లి పార్వతి వేరే రూపాన్ని ధరించిందని.. ఆ రూపానికి శివుడు ఎంతగానో ఆకర్షితుడయ్యాడని. ఆమెను తనతో తీసుకెళ్లడానికి అంగీకరించాడని నమ్ముతారు. దీంతో ధింగ గవర్ పూజలు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొననుండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తును నిర్వహిస్తుంటారు.

Funny video: మీ ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉందా.. అయితే ఇంటి నుంచి ఇలా ఈజీగా వెళ్లగొట్టండి..

Updated Date - 2023-04-10T15:24:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising