ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

World's tallest dog: ప్రపంచంలోనే ఎత్తైన కుక్క మృతి.. బోన్ క్యాన్సర్‌తో ప్రాణాలు విడిచిన జ్యూస్

ABN, First Publish Date - 2023-09-14T19:27:09+05:30

ప్రపంచంలోనే అత్యంత పొడవైన కుక్కగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ను కైవసం చేసుకున్న గ్రేట్ డేన్ కుక్క జ్యూస్(3) మరణించింది. అది చాలా కాలంగా ఎముకల క్యాన్సర్‌తో బాధపడుతోంది.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన కుక్కగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ను కైవసం చేసుకున్న గ్రేట్ డేన్ కుక్క జ్యూస్(3) మరణించింది. అది చాలా కాలంగా ఎముకల క్యాన్సర్‌తో బాధపడుతోంది. గ్రేట్ డేన్ 1.046 మీటర్ల (3 అడుగుల 5.18 అంగుళాలు) పొడవు ఉండేది. టెక్సాస్‌లోని బెడ్‌ఫోర్డ్‌లో తన యజమానితో అది నివసించేది. దానికి సోకిన న్యుమోనియా వ్యాధి తీవ్రత పెరగడంతో పరిస్థితి విషమించి మృత్యువు ఒడికి చేరింది.


దాని మృతిపై ఆఫీషియల్ సమాచారాన్నియజమాని డేవిస్ GoFundMe పేజీలో వెల్లడించారు. "మా మగబిడ్డ మమ్మల్ని విడిచి వెళ్లిపోయాడు. మా హృదయాలు పగిలిపోయాయి. వ్యాధితో అది ఎంతో ధైర్యంగా పోరాడింది. కానీ విధి వక్రీకరించింది" అని డేవిస్ వాపోయాడు. శునకానికి ఎముక క్యాన్సర్ వచ్చిందని తెలిసి దానికి చికిత్స కోసం యజమాని నిధులు సేకరించడం ప్రారంభించాడు. 12 వేల డాలర్లకు గానూ 8 వేల డాలర్లు విరాళాల ద్వారా సేకరించగలిగారు. సెప్టెంబర్ 7న జ్యూస్ కి సర్జరీ చేయగా అది సక్సెస్ అయింది. సర్జరీ అయిన 3 రోజుల నుంచి కుక్క ఏమీ తినడానికి ఇష్టపడలేదని.. క్రమంగా నీరసించిపోయిందని యజమాని తెలిపారు. నోరు కూడా బ్లూ కలర్ లోకి మారిందని.. జ్వరం కూడా వచ్చిందని చెప్పాడు. డాక్టర్లు ఆస్పిరేషన్ న్యుమోనియా వచ్చిందని భావించి కుక్కకు యాంటీ బయోటిక్స్ ఇచ్చారు. కానీ అవి ఫలించకపోవడంతో శునకం ప్రాణాలు విడిచింది. సోషల్ మీడియాలో దానికి నివాళి అర్పిస్తున్నారు.

Updated Date - 2023-09-14T19:29:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising