YCP fake videos: వైసీపీ పేటీఎం బ్యాచ్ బరితెగింపు.. ఎంత దారుణమైన ఫేక్ వీడియో క్రియేట్ చేశారో చూడండి..

ABN, First Publish Date - 2023-02-20T20:48:37+05:30

దౌర్జన్యాలు, అరాచకాలతో కొనసాగుతున్న వైసీపీ (YCP) పాలనను విపక్ష టీడీపీ (TDP) ఎండగడుతుండడం పాలక పక్షానికి రుచించడం లేదు.. ఎంత దారుణమైన ఫేక్ వీడియో క్రియేట్ చేశారో మీరే చూడండి..

YCP fake videos: వైసీపీ పేటీఎం బ్యాచ్ బరితెగింపు.. ఎంత దారుణమైన ఫేక్ వీడియో క్రియేట్ చేశారో చూడండి..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దౌర్జన్యాలు, అరాచకాలతో కొనసాగుతున్న వైసీపీ (YCP) పాలనను విపక్ష టీడీపీ (TDP) ఎండగడుతుండడం పాలక పక్షానికి రుచించడం లేదు. సీఎం జగన్ సర్కార్ (Jagan govt) వైఫల్యాలను ఎత్తిచూపుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu) సహా ఇతర టీడీపీ నేతల విమర్శలను వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. జనాల్లో వైసీపీ వ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోతుండడంతో తప్పులను కప్పిపుచ్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటర్నెట్, సోషల్ మీడియా వేదికగా వైసీపీ సోషల్ మీడియా (YSRCP Social Media) కేటుగాళ్లు తమకే సాధ్యమైన కుయుక్తులు పన్నుతున్నారు. పేటీఎం బ్యాచ్ కంత్రిగాళ్లు ఫేక్ వీడియోలను (Fake videos) రూపొందించి వాటిని సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో వదులుతున్నారు. ఇటివల చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ప్రసంగాన్ని సైతం ఇందుకోసం ఉపయోగించుకున్నారు.

fake-videos.jpg

చంద్రబాబు తూర్పుగోదావరి సభలో మాట్లాడిన మాటలను అత్యంత దారుణంగా ఎడిటింగ్ చేసిన వైసీసీ సోషల్ మీడియా కేటుగాళ్లు వాటిని ఇంటర్నెట్, సోషల్ మీడియాలో వదిలిపెట్టారు. అనపర్తి సభలో చంద్రబాబు ముందుగా మాట్లాడిన మాటలను చివరకు... చివరిలో మాట్లాడిన మాటలను మొదటికి అతికించి వీడియోలను ఎడిటింగ్ చేశారు. ఆ వీడియోల ద్వారా అమాయక జనాలను ఏమార్చే ప్రయత్నం చేశారు. ఈ ఫేక్ వీడియోలను తమ పేటీఎం బ్యాచ్ ద్వారా షేర్లు, లైక్‌లు చేయిస్తున్నారు. అందుకోసం హైసెక్యూరిటీని కూడా వాడేందుకు వెనుకడుగువేయడం లేదు. వీడియోలను ఎవరూ డౌన్‌లోడ్ చేయకుండా ప్రత్యేక యాప్‌లను వైసీపీ బ్యాచ్ వాడుతోంది. పైగా వీడియోలకు టాలీవుడ్ యువహీరో సిద్ధు జొన్నలగడ్డ ఫొటోలను వైసీపీ కంత్రిగాళ్లు వాడుతుండడం కొసమెరుపు. ఆ ఫేక్ వీడియో ఎంత దారుణంగా ఉందో మీరూ చూడండి.

Updated Date - 2023-02-20T20:53:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising