ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Year Ender 2023: ఈ ఏడాది సోషల్ మీడియాను షేక్ చేసింది వీళ్లే..

ABN, Publish Date - Dec 22 , 2023 | 10:04 PM

2023 సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి.. 2024 నూతన సంవత్సరానికి స్వాగతం పలకాల్సిన సమయం ఆసన్నమవుతోంది. ఇలాంటి ప్రస్తుత తరుణంలో 2023లో జరిగిన వింతలు, విశేషాలపై చాలా మంది గుర్తు చేసుకోవడం సర్వసాధరణమే. సమాజంపై...

2023 సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి.. 2024 నూతన సంవత్సరానికి స్వాగతం పలకాల్సిన సమయం ఆసన్నమవుతోంది. ఇలాంటి ప్రస్తుత తరుణంలో 2023లో జరిగిన వింతలు, విశేషాలపై చాలా మంది గుర్తు చేసుకోవడం సర్వసాధరణమే. సమాజంపై సోషల్ మీడియా విపరీతమైన ప్రభావం చూపుతున్న ప్రస్తుత తరుణంలో కొందరు రాత్రికి రాత్రే స్టార్స్ అవుతున్నారు. ఈ సందర్భంగా 2023లో నెట్టింట చర్చనీయాంశంగా మారిన వ్యక్తుల గురించి తెలుసుకుందాం..

1. బర్రెలక్క

తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లికి చెందిన బర్రెలక్క అసలు పేరు కర్నె శిరీష. వీరిది పేద కుటుంబం కావడంతో.. ఈమె ఓపెన్ డిగ్రీ చదువుతూనే మరోవైపు బర్రెలు కాస్తూ ఉండేది. ఈ క్రమంలో ఆమె చేసిన వీడియోల ద్వారా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు వచ్చింది. అయితే 2023 తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది.


2. పల్లవి ప్రశాంత్

తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మండలం కొల్గూర్ గ్రామానికి చెందిన పల్లవి ప్రశాంత్ సమాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. డిగ్రీ తర్వాత చదువు మానేసిన ఇతను.. ఓ వైపు వ్యవసాయ పనులు చేస్తూ, మరోవైపు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే 2023 సెప్టెంబర్‌లో బిగ్‌బాస్ సీజన్ 7.. అతడి జీవితాన్ని మలుపు తిప్పిందనే చెప్పాలి. చివరికి అందులో విజేతగా నిలిచి తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యాడు.


3. చందూ సాయి

యూట్యూబ్‌లో పక్కింటి కుర్రాడిగా తెలుగు వాళ్లకు దగ్గరైన ప్రముఖ యూట్యూబర్ చందూ సాయిని.. 2023లో రేప్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆరేళ్లుగా యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోలు చేస్తున్నా కూడా.. రేప్ కేసుతో ఒక్కసారిగా మరింత చర్చనీయాంశమయ్యాడు. హైదరాబాద్‌లోని నార్సింగికి చెందిన ఓ అమ్మాయి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిపై కేసులు నమోదు చేశారు. ప్రేమ పేరుతో తనను మోసం చేసి రేప్ చేశాడని సదరు యువతి ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది.


4. జాస్మిన్ కౌర్

దుస్తుల వ్యాపారం చేసే ఈమె.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని బాగా వైరల్ అయింది. ఈ డ్రెస్ ఎంత బాగుందో.. జస్ట్‌ లుకింగ్‌ లైక్‌ ఎ వావ్‌ .. అనే ఒక్క డైలాగ్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది. అది ఎంతలా అంటే సామాన్యుల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకూ అంతా ఈమె డైలాగ్ ఉచ్ఛరించే వరకూ వెళ్లింది. సోషల్ మీడియాలో పేరు రావడంతో పాటూ తన వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చేసుకుంది.


5. SDM జ్యోతి మౌర్య

ఉత్తరప్రదేశ్‌కు చెందిన అలోక్ నాథ్ అనే వ్యక్తి పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తూ.. తన భార్య జ్యోతి మౌర్యను బాగా చదివించాడు. భర్త ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె కూడా కష్టపడి చదువుకుని చివరు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఉద్యోగం సంపాదించింది. అయితే చివరకు ఆమె తన సీనియర్ అధికారితో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను మోసం చేసింది. వీరి వ్యవహారం ఈ ఏడాది సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది.


6. సచిన్ - సీమా

పాకిస్థాన్‌‌కు చెందిన సీమా హైదర్, భారత్‌కు చెందిన సచిన్ మీనా ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఈ ఏడాది వీళ్లు రాత్రికి రాత్రే స్టార్స్ అయ్యారు. పబ్జీ గేమ్ ద్వారా పరియమైన వీరు.. చివరకు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సీమా ఈ ఏడాది మేలో తన నలుగురు పిల్లలతో పాకిస్థాన్ నుంచి భారత్ వచ్చింది. వీరు ప్రస్తుతం ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఉంటున్నారు.


7. అమర్జీత్ జయకర్

బీహార్‌కు చెందిన అమర్జీత్ జయకర్ పాటలు పాడుతూ, ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో 2023లో ఇతను పాడిన పాటలు బాగా వైరల్ అయ్యాయి. చివరక బాలీవుడ్‌లోని చాలా మంది ప్రముఖులు అమర్జీత్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ప్రధానంగా సోనూ సూద్, ప్రముఖ గాయకుడు హిమేష్ రేష్మియా.. జయకర్‌ను అభినందించారు.

Updated Date - Dec 22 , 2023 | 10:04 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising