ముందే నిజం చెప్తున్నా.. నేను అత్యాచార బాధితురాలిని.. అయినా నన్ను పెళ్లి చేసుకుంటారా..? ఓ యువతి సూటి ప్రశ్న.. చివరకు..
ABN, First Publish Date - 2023-03-20T16:35:56+05:30
ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరూ తల్లీకొడుకులు. చాలా స్టైల్‌గా కనిపిస్తున్న వారి కథ వింటే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.
ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరూ తల్లీకొడుకులు. చాలా స్టైల్‌గా కనిపిస్తున్న వారి కథ వింటే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు రాణి (అసలు పేరు కాదు). సరిగ్గా 11 సంవత్సరాల క్రితం రాణికి 13 ఏళ్లు. అందరిలాగానే చాలా సంతోషంగా ఆడుతూ పాడుతూ జీవించేది. అకస్మాత్తుగా ఒక మానవ మృగం ఆమె జీవితాన్ని నాశనం చేసింది. ఒక వ్యక్తి ఆమెను అత్యాచారం చేశాడు. ఫలితంగా రాణి గర్భవతి (Pregnant)అయింది. 13 ఏళ్లకే ఒక కొడుక్కి జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ కుర్రాడి వయసు 10 సంవత్సరాలు.
పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు గతేడాది మే నెలలో రాణిని ఓ యువకుడు వివాహం (Marriage) చేసుకున్నాడు. ఆమె కొడుకును దత్తత తీసుకున్నాడు. తాను అత్యాచార బాధితురాలినని పెళ్లికి ముందే ఆమె చెప్పింది. మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) భోపాల్‌లో కొందరు యువకులు పెద్ద మనసుతో వ్యవహరిస్తున్నారు. అత్యాచారాలకు గురై షెల్టర్ హోమ్స్‌లో ఉంటున్న బాధితులను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకు భోపాల్ అలాంటి వివాహాలు నాలుగు జరిగాయి. (Inspirational Story)
చెత్తకుప్పను తవ్వుతుండగా కనిపించిందో బాక్స్.. అనుమానంతో ఆ చెత్తనంతా పక్కకు తీయగానే కనిపించిన దృశ్యం చూసి పోలీసులకు షాక్..!
అత్యాచార బాధిత మహిళలను వివాహం చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారని, అందుకే బాధితుల గతాన్ని దాచిపెట్టాల్సి వచ్చేదని భోపాల్ డివిజన్ మహిళా, శిశు అభివృద్ధి శాఖ జాయింట్ డైరెక్టర్ నకీ జహాన్ ఖురేషి అంటున్నారు. 2018లో ఓ మహిళకు అలాగే వివాహం చేశామని, ఒక సంవత్సరం తర్వాత అతడికి నిజం తెలిసి భార్యను తిరిగి షెల్టర్ హోమ్‌లో విడిచిపెట్టాడని చెప్పారు. అయితే రాణి మాత్రం తనను పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తికి ముందుగానే తన గతం మొత్తం చెప్పిందని, అన్నీ తెలుసుకున్న తర్వాతే అతడు ఆమెను వివాహం చేసుకున్నాడని తెలిపారు.
20 ఏళ్ల నర్సింగ్ యువతి.. తల్లిదండ్రులకు రాసిందో లేఖ.. చనిపోయిన అతడు రోజూ నా కలలోకి వస్తున్నాడంటూ..
Updated Date - 2023-03-20T16:38:24+05:30 IST