ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

How To Create Wealth: జీతమే సరిపోవడం లేదు.. ఇక సేవింగ్స్ ఎక్కడ..? అని వాపోతున్నారా..? ఈ 7 సూత్రాలను పాటిస్తే..!

ABN, First Publish Date - 2023-08-11T16:46:12+05:30

భద్రమైన భవిష్యత్తు కోసం ప్రతిఒక్కరూ పరితపిస్తారు. అందుకోసం సరైన ప్రదేశాలలో డబ్బును ఆదా చేయడం మరియు పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యమని భావిస్తారు. ఉద్యోగం, వ్యాపారం లేదా ఇతర రకాల ఆదాయాలు ఎప్పుడైనా ఆగిపోవచ్చు. అలాగే నష్టాలను చవి చూడాల్సి రావచ్చు.

భద్రమైన భవిష్యత్తు (Future) కోసం ప్రతిఒక్కరూ పరితపిస్తారు. అందుకోసం సరైన ప్రదేశాలలో డబ్బును ఆదా చేయడం మరియు పెట్టుబడి (Investment) పెట్టడం చాలా ముఖ్యమని భావిస్తారు. ఉద్యోగం, వ్యాపారం లేదా ఇతర రకాల ఆదాయాలు ఎప్పుడైనా ఆగిపోవచ్చు. అలాగే నష్టాలను చవి చూడాల్సి రావచ్చు. అటువంటి పరిస్థితిలో జీవితం తడబడకుండా ఉండాలంటే భవిష్యత్తు ప్రణాళిక (Future planning ) చాలా ముఖ్యం. అలాంటి ప్రణాళిక కోసం ఏడు ముఖ్యమైన సూత్రాలను పాటించాలి. అవేంటో ఒకసారి చూద్దాం..

1)నగదును నిర్వహించే కళ

మీరు ఉద్యోగం, వ్యాపారం.. ఏం చేస్తున్నా సరే అందులో వచ్చే డబ్బును పొదుపు (Saving Money) చేసే కళ నేర్చుకోవాలి. ప్రతి నెలా కుటుంబ బడ్జెట్‌ను సమీక్షించి కొంత డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నించాలి.

UPI Lite: గుడ్ న్యూస్.. ఇంటర్నెట్ లేకుండానే ఇకపై డబ్బులు పంపించొచ్చు.. కానీ ఒకే ఒక్క కండీషన్ ఏమిటంటే..!

2)ఆస్తిని కాపాడుకోవడం

మీకు ఉన్న చర, స్థిరాస్తి ఏదైనా సరే దానిని పరిరక్షించుకోవాలి. నగలు, భూమి, బ్యాంకులో నగదును రక్షించుకోవాలి. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినపుడు ఈ ఆస్తి దివ్యౌషధంలా పనిచేస్తుంది. అలాగే తప్పనిసరిగా జీవిత భీమా కూడా తీసుకోవాలి.

3)ఆర్థిక భద్రత అవసరం

భవిష్యత్తు ఖర్చులను ముందుగానే ఊహించి ప్రణాళిక వేసుకోవాలి. పదవీ విరమణ తర్వాత ఏం చేయాలి, పిల్లల చదువులకు ఎంత ఖర్చు చేయాలో ముందుగానే ఆలోచించుకోవాలి. అంతే కాకుండా ఆకస్మిక సంఘటనలు ఎదురైతే వాటి నుంచి ఎలా బయటపడాలో కూడా ముందే ప్రణాళిక రూపొందించుకోవాలి.

4)10 శాతం పెట్టుబడి

మీరు ప్రతి నెలా మీ నెలవారీ ఆదాయంలో కనీసం 10 శాతం పెట్టుబడి పెట్టాలి. బాండ్సు, ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్, బంగారం మొదలైన వాటిల్లో దీర్ఘకాలిక, స్వల్పకాలిక సమయాలకు పెట్టుబడి పెడితే కొన్నేళ్లకు రెట్టింపు అవుతుంది.

5)క్రెడిట్ విషయంలో జాగ్రత్త..

వీలైనంత వరకు క్రెడిట్ కార్డుల (Credit Cards) జోలికి వెళ్లకూడదు. అప్పు చేసి ఏ వస్తువులనూ కొనకూడదు. ఒకవేళ్ల క్రెడిట్ కార్డు మీద కొనాల్సి వస్తే.. ఎప్పటికప్పుడు బిల్లలు చెల్లించాలి. లేకపోతే వడ్డీతో సహా అప్పులు పెరిగిపోతాయి.

6)సింపుల్‌గా ఉండండి..

వీలైనంత వరకు సాధారణ జీవితాన్ని గడపడానికి చూడండి. ఖరీదైన వస్తువులు, కార్ల జోలికి వెళ్లకపోవడం ఎంతో ఆదా చేస్తుంది. నిజానికి చాలా మంది బిలియనీర్లు అనవసర ఆర్భాటాల జోలికి పోకుండా సాధారణ జీవితాన్నే గడుపుతారు. డబ్బు ఆదా చేయడానికి ఇది ఉత్తమ మార్గం. షాపింగ్, ట్రావెలింగ్ కోసం వెచ్చించే మొత్తం ఆదా అవుతుంది.

7)వారసత్వాన్ని నిర్ణయించండి..

జీవించి ఉన్నప్పుడే కాద.. మరణం తర్వాత కూడా ప్లాన్ చేసుకోవాలి. అందువల్ల మిగిలిన కుటుంబ సభ్యుల జీవితాలు సాఫీగా సాగుతాయి. సంపాదించిన ఆదాయం, ఆస్తులు ఎవరెవరికి ఎంతెంత దక్కాలో ముందుగానే వీలునామా రాసి ఉంచండి.

Updated Date - 2023-08-11T16:46:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising