Balloons: నోటితో నేరుగా బెలూన్లను ఊదేస్తున్నారా? ఇకపై ఆ పొరపాటు చేయకండి.. ఎందుకంటే..
ABN, First Publish Date - 2023-10-08T16:22:04+05:30
సాధారణంగా బర్త్ డేలు లేదా ఏ ఇతర ఫంక్షన్‌లైనా అలంకరణ కోసం బెలూన్లను ఉపయోగిస్తుంటారు. డెకరేషన్ అందంగా కనబడాలంటే ముందుగా ఉండాల్సింది బెలూన్లే. అయితే బెలూన్లను ఊదే విషయంలో చాలా మంది తప్పులు చేస్తుంటారు. ప్యాకెట్ నుంచి బెలూన్లను బయటకు తీసి నేరుగా నోటితో ఊదేస్తుంటారు.
సాధారణంగా బర్త్ డేలు లేదా ఏ ఇతర ఫంక్షన్‌లైనా అలంకరణ కోసం బెలూన్లను (Balloons) ఉపయోగిస్తుంటారు. డెకరేషన్ అందంగా కనబడాలంటే ముందుగా ఉండాల్సింది బెలూన్లే. అయితే బెలూన్లను ఊదే (Balloons inflating) విషయంలో చాలా మంది తప్పులు చేస్తుంటారు. ప్యాకెట్ నుంచి బెలూన్లను బయటకు తీసి నేరుగా నోటితో ఊదేస్తుంటారు. మీరు ఇలాగే కనుక చేస్తుంటే ఇకపై జాగ్రత్త పడండి. ఎందుకంటే అలా చేయడం చాలా ప్రమాదకరం (Health Tips).
బెలూన్లను తయారు చేసేటపుడు ఉపయోగించే రసాయానాలు (Chemicals) ప్రమాదం కలిగిస్తాయి. అంతేకాదు ఆ రసాయనాలు హానికర బ్యాక్టీరియాను (Bacteria) ఆకర్షిస్తాయి. ప్యాకెట్ నుంచి తీసిన బెలూన్‌ను కడగకుండా నేరుగా నోట్లో పెట్టుకుని ఊదేస్తే ఆ బ్యాక్టీరియా, రసాయనాలు నోట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. తరచుగా అలా చేస్తుంటే జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. డేనియల్ బేర్డెన్ అనే మహిళ టిక్‌టాక్‌లో బెలూన్‌లకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది (Balloon Care Tips).
Viral: గులాబీ రంగు సరస్సు వెనకున్న మిస్టరీ ఏంటి? ఆ నీటికి ఆ రంగెలా వచ్చింది.. పోటెత్తుతున్న పర్యాటకులు
బెలూన్లను కడగకుండా నేరుగా ఉపయోగిస్తే ఏం జరుగుతుందో ఆమె ఆ వీడియోలో చూపించింది. ఓ బెలూన్‌ను ఆమె టబ్‌లో ఉన్న డిటర్జెంట్‌లో కొంత సేపు నానబెట్టింది. ఆ తర్వాత ఆ బెలూన్‌ను బయటకు తీసి రుద్దింది. అప్పుడు ఆ బెలూన్‌ను నుంచి నల్లటి రంగులో ఉన్న మురికి బయటకు వచ్చింది. బెలూన్‌ను నానబెట్టిన నీరు చాలా మురికిగా మారిపోయింది. బెలూన్ మాత్రమే కాదు.. పెన్, మొబైల్ కవర్, కీ చైన్, వైర్, బాటిల్ క్యాప్ వంటి వస్తువులను కూడా నోటిలో పెట్టుకోకూడదని ఆమె తెలిపింది.
Updated Date - 2023-10-08T16:22:04+05:30 IST