Viral Video: ఏం టెక్నిక్ బాసూ.. నీ క్రియేటివిటీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. కష్టపడకుండానే పడవ ఎలా నడుపుతున్నాడో చూస్తే..!
ABN, First Publish Date - 2023-08-25T17:24:20+05:30
``బ్రెయిన్ వాడితే స్ట్రెయిన్ తగ్గుతుంది``.. అనేది ఓ సినిమాలో డైలాగ్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు వీడియోలు చూస్తుంటే ఈ డైలాగులు గుర్తుకు రాక మానవు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా మంది ప్రతిభ వెలుగులోకి వస్తోంది. మారుమూల ప్రాంతాల్లోని వారి ట్యాలెంట్ కూడా అందరినీ చేరుతోంది.
``బ్రెయిన్ వాడితే స్ట్రెయిన్ తగ్గుతుంది``.. అనేది ఓ సినిమాలో డైలాగ్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు వీడియోలు (Jugaad Videos) చూస్తుంటే ఈ డైలాగులు గుర్తుకు రాక మానవు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా మంది ప్రతిభ వెలుగులోకి వస్తోంది. మారుమూల ప్రాంతాల్లోని వారి ట్యాలెంట్ (Talent)కూడా అందరినీ చేరుతోంది. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో యువకుడు పెద్దగా శ్రమ పడకుండా పడవ (Boat)ను నడుపుతున్నాడు.
@Rainmaker1973 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి నదిపై పడవలో వెళ్తున్నాడు. అయితే అతడు కష్టపడి తెడ్డు వేసి పడవను నడపడం లేదు. సైకిల్ తొక్కుతున్నట్టు పెడల్‌ను తొక్కుతుంటే పడవ దానంతట అదే ముందుకు వెళ్లిపోతోంది. పడవ వెనుక సైకిల్ చైన్ వేసి ఇరువైపులా తెడ్లు వేసుకున్నాడు. పడవలో కూర్చుని సైకిల్ తొక్కుతున్నట్లు తొక్కుతుంటే ఆ పడవ ముందుకు వెళ్లిపోతోంది. ఈ ఐడియా చాలా మందిని విశేషంగా ఆకట్టుకుంది (Creative Videos).
Viral Video: ప్రాణాలకు తెగించావు కదయ్యా.. ఒక్క క్షణం ఆలోచించి ఆగి ఉంటే ఆ పాప బతికేదే కాదేమో..!
ఈ వీడియోను ఇప్పటివరకు ఏకంగా 57 లక్షల మంది లైక్ చేశారు. 70 వేల మందికి పైగా లైక్ చేశారు. ఆ వ్యక్తి క్రియేటివిటీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ``ఏం క్రియేటివిటీ బాసూ``, ``చాలా తెలివిగా తయారు చేశారు``, ``చాలా శ్రమ తగ్గుతుంది``, ``ఐడియా బాగుంది. కాకపోతే పడవ ఎటువైపు వెళ్లాలో కంట్రోల్ చేయడం కుదరదేమో``, ``జీనియస్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-08-25T17:24:20+05:30 IST